ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 105

జేసి యేమయియీ మాట మాటు పెట్టక గొబ్బునం జెప్ప నేర కున్నవారము చెప్పి వేఁడికొనక యే పనికిని నీవు చొరమి మొదలన పదిలంబుగాఁ దెలిపిన దానవు గావున.

ఉ. వట్టిమఱుంగుఁ బెట్టి నుడువం బని లే దది యెల్ల భేరి జో
కొట్టుట కాకని నైలువఁ గూడునె మాటల నీవు గంటి న
న్నట్టిశుభాంగుఁ డీరమణియానల కాస్పద మిప్పు డాతని
టిగ నన్వయాది కథనంబున దెల్పి యనుగ్రహింపవే.

తే. ఇప్పడిది చెప్ప కెడ సేయు టీలతాంగి
బ్రాణసంకటపఱుచు టోపక్షిరమణి
 కావునను గానవలయు శీఘ్రంబ చెప్పి
వెనుక నెఱిఁగింతు నీకు మావృత్తమెల్ల.

వ. అనిన శుచిముఖి వచనవక్రత చాలించి యిట్లనియె.

ఉ. అంతిపురంబుకన్యలఁట యాత్మ తెఱం గభిథాప్రయుక్తి నొ
క్కింతయు నేర్పరింపరట యిట్లన నిట్లని నాకు నాకె య
 ర్ధాంతరము ల్గడించుకొని యంజక యెట్లు యువస్తుతుల్ ప్రపం
 చింతు నటంచు నుంటి నికఁ జెప్పెద మీరలు గుట్టుదెల్పుటన్.

ఈ భాగము కవి వ్రాసినదియా ? స్వభావసిద్ధమా ? స్వభావ మును మఱపింపఁ జేయునట్టి శిల్పమ. శిల్పముగాని యన్యము కృత్రిమము . ప్రకృతి ననుసరింపనిచోఁ గళకు సత్యమురాదు. మఱి యనుసరించుటఁ దప్ప నింకేవిషయములేకున్న సత్యమున్నను సొగసుండదు. అనుసరించినట్టేపోవుచుఁ గ్రమక్రమముగ మీఱి మెఱయుట కళాసామ్రాజ్యము. ఒకానొకరు చెప్పిన రీతి, ప్రకృతి యా కారము. ఆ యూకారమును చక్కఁగా నలంకరించి మెఱుఁగు పెట్టినరీతిని తగిన విషయముల సంగతిని బొదిగి సజీవమై లేచి వచ్చునట్లు చేసిన నయ్యది కళ. ఈ భాగము దివ్యము. పాము జాడ పామునకు గుర్తు. స్త్రీల జాడ స్త్రీల కే యెఱుక. శుచిముఖి యొక్క బిగువు బింకములు పొడుపుమాటలు, యుక్తులు వర్ణింపఁదరమా ? ప్రభావతిని బొమ్మరీతి నాడించునామె వాచాలత స్తుత్యతీతము.

కల్పనా స్ఖాలిత్యములు

           కల్పనయందు నీ కావ్యము నిర్దుష్టమని యంటిమి . అమ్మాటకు

బాధకము లొండు రెండు గన్పట్టెడి. సునాభుని కూఁతులకు గదసాంబులు పతులగుదురని నారదు లా శీర్వదించి పోcగా.