ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 కవిత్వతత్త్వ విచారము

  భవత్పరిపృష్ట మెంతయున్, జనక ని మే ష ముం దడయసంగతి 
  గాదును    మాకు నైన నీ, వనఁగ జనార్దనుండనఁగ నారయ భేదము 
  లేదు గావునన్, వినుపింతు" నని బిగువ బేరము గన (బ అచినది !
  మఱి కన్యామణి సౌందర్యముంగూర్చి నిమిష ము నిలువ నో పని 
  దయ్యు గంట పుడు వివరముల లెక్క ప్రకారము వినుతించియు,
    తన ప్రతిభను గొంత చెప్పనదియై
  “ఉ. ఎమ్మెయిఁ బ్రజ్ఞ మీఱ వచియించెదనన్న వచింపలేన య
       క్కొమ్మ బెడంగులోన నొక కోటితమాంశమునైన, నంత మా 
       త్రమ్మ మదు క్తిశక్తి యనరా దతివాజ్మహిమాఢ్యనేను, మా 
       యమ్మ సరస్వతీసతి తనంతటిదానిగ నన్ను దిద్దుటన్.”
  “చ. నలినజురా వాస మొుక నాఁడు ననుం దనచేతి ప్రోదిరా
       చిలుకను వాదుకుం గవితఁ జెప్పఁగఁ దా నియమించి యందునా 
        పలుకులఁ గొంతవాసిగని భావమునంగడు మెచ్చుచున్న ఖాం 
         చలమున నాదురెక్కలను చక్కఁగ దువ్వచు గారవింపుచున్."
   చ. ప్రబలములైన కౌతుక కృపారస వత్సలతాదరంబులని
       శబలితచిత్తయై యపుడు నా కుపమాతిశయోక్తి కామధే 
       ను బిరుదమిచ్చి తల్లిఖితనూపురమున్ భువనైక మాతయు 
       య్యబల మదంఘ్రుఁదా దొడిగె నాటిరుదు బదిచూడుమేర్పడన్.
                                                           {ప్రభా. ఆ. 2, ప. 90,92,97)
       అని  విడిచి  బిరుదమునకు  దర్శన  ప్రాయ   వాక్యములాడినది !  అన్నింటికైనను  సొగసైన  ఘట్టము  ప్రభావతీ  శుచిముఖుల    వాగ్యుద్ధము. తన రహస్యము  ప్రకాశముగచేయక  ప్రద్యుమ్నుని  పృత్తాం  తముఁ దెలిసికొన వలయునని   ప్రభావతియు,   ఆగుట్టు   దీసికాని    యాపెకోర్కి   నెరవేర్చగూడదని హంసియు ,  నొండో రు లం జఆలిచి  మల్లయుద్ధ   నైపుణింజూపుట (అనఁగా మాటల మాత్రము)    యుత్త    మోత్తమ    ప్రదర్శనములలో   గణ్యము.   స్త్రీ   స్వభాపము నెంత    నేర్పుతోఁ   గనుపఱచుచున్నాఁడు,   ఆ ఘట్టమునంతయు  జదివినఁ      గాని   దాని    చవిగ్రోలలేము.
       (మూఁడవ యాశ్వానము 44 వ పద్యము మొదలు 75 వ పద్యమువఱకు)
         క.  ఇటు  గాక  లోకముల  నిం
              తటిచెలువుఁడు గలఁడె గలిగినను నుబ్చెద యి