ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ భాగము 97

          పశుకృత్యమే కామమునుట యిందుచే సువ్యక్తముగదా !మఱి  యిట్టి వ్రాఁతల నితరులకు • వ్రాయువాని మనశ్శుభ్రత యెట్టిదో ! కవి ప్రద్యుమ్ను నిట్టి నీచపాత్రముం జేయుట యాతఁడు గొల్లఁ డని యూ ?
         దోషవిచారము చాల దూరము చేసితిమి. ఇందునకుఁ గారణ ములు రెండు నిష్పక్ష పాతబుద్ధితో నారయుట విమర్శకుల ధర్మము. రెండవది కళాపూర్ణోదయము యొక్క గొప్పతనము కొలత యెత్తఁ గోరిన సాధారణ ప్రబంధములకుం దానికింగల వ్యత్యాసము ప్రకటించుట యావశ్యకము. ఇంతే కాని దోషములC జూపినందున గుణములు లేవను సన్యాయ్యాపవాదము మోపువారము గాము.
                      కావ్యములోని మంచి గుణములు
           ఎంత దక్కువ పడినను స్వభావమును బూర్తిగఁ బోగొట్టుకొన ੇ ਹੋ ? అర్లే యెన్నిలోపములున్నను సూరన తన నైజము నేల విడుచును ! ఈ కావ్యములో కొన్ని యద్భుత విశేషములున్నవి. అవి యనితర సాధ్యములు. మానవ ప్రకృతి నద్దము వలెఁ జూపించు నవి. సంభాషణములు విస్మయావహములు. నాటక ధర్మములను బోషించియున్నాఁడు. స్థాలిత్యములతో మిశ్రమైనదను చింతయే గాని నాకు గుణము మగ్నమైనదని క్షణమైన నెంచినవాఁడఁగాను. ఈ గ్రంథమున నాశ్చర్యకరమైన పాత్రము శుచిముఖి. ఈ హంసి యొక్క దిట్ట తనము, బిగువు, నేర్పు, తీcపిమాటలు, మెత్తమనసు, చమత్కారము నాహ్లాదకరములు. అనేక పాత్రములు ప్రదర్శింపC బడు స్థానముల వర్ణనలు తఱుచుగ సంభాషణ మూలముగఁ జేయC బడియున్నందున నివి పాలు పెక్కినవి. సంభాషణములనఁ గా దీర్ఘ ప్రసంగములుగావు. అవి సామాన్య ప్రబంధ కారుల విలాపములు. మఱి యిందు ( గలసి మెలసినట్లు పలుకCబడు వచనములు. మాట మీఁదు గా మాట వచ్చిన నే యందము. బడిపంతులవలె అరగంట వ్యాఖ్యానముం జేసిన నాటక సరణి చెడును. కథయందు నిరర్ధ కాంగములు మెండుగ లేవు. కల్పనయెుక్క జిగిబిగి కళాపూర్లో దయమునకన్న సాంద్రమని నా విజ్ఞప్తి. ప్రత్యేక వర్ణనలు భావ సమృద్ధములు. చూడు Cడు. ప్రద్యుమ్నుఁడు పోలో' యనఁ బ డు గుఱ్ఱపు సవారి చెండాట నాడుచుండుట కవి యెంతరమ్యముగ వర్ణించియున్నాఁడో !

خ۹ حسد سه ۶ر