పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/69

ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

63


సరించి బ్రహ్మానంద సోదరమైన పరనిర్వృతిగ నిర్ణయింపఁబడినది. కావ్యము లనఁగాఁ బసిబిడ్డ లాడుకొనుటకై మన మిచ్చు రంగుల బొమ్మలుగావు; అనాగరకతా దోషము పాపుకొనుటకు మేజా బల్లలపైఁ బ్రదర్శింపఁబడు భూషణ గ్రంధములనుగా కావ్యములను మన మెప్పుడు తలంప లేదు. మన జీవితమునందు కావ్యములు మిళితమై పోయినవి. ఆర్య సాంఘిక జీవన ప్రవాహమునకు రెండు తటములుగ నున్న రామాయణ మహాభారతములే యిందులకు దృషాంతము. సీత, దమయంతి , సావిత్రి, ద్రౌపది మున్నగు పౌరాణిక సతీ రత్నములు భారతదేశమునం దెందఱు పతివ్రతల సృజింప లేదు ? సంసారమందు నిర్భర దారిద్ర్యమును, కష్టపరంపరలను ననుభవించుచున్న సతీమణులకు దమయంతి, ద్రౌపది, చంద్రమతి మున్నగు నిల్లాండ్ర చరిత్రము లెంత యూఱట నొడగూర్చియుండలేదు. ఈ నారీవతంసము లందఱు వ్యాస, వాల్మీకి మహాకవుల భావప్రపంచమునఁ బుట్టి పెంపొందిన ఆదర్శక సృష్టులేకదా ! అట్టి కవులెన్నఁటికైన నిర్భాధ్యు లగుదురా ? వారి రచనలు నీతి బాహ్యములగునా ?

కీట్సు {keats) అను ఆంగ్లేయకవి Beauty is truth, truth beauty అని చెప్పియున్నాఁడు. మన పూర్వికులు సత్య సౌందర్యములకు శ్రేయమునుగూడఁ జేర్చిరి. కావ్యము విశ్వశ్రేయము చేకూర్చునదిగ నుండవలయును. అనీతి దాయకమైన దేదియు లోకళల్యాణము నాపాదింపలేదు.

ఇఁక నీతియననేమి? దాని నెవరు కల్పించిరి? దానివలనఁ బ్రయోజనమేమి? అను నీ విషయములు మనసున