పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/50

ఈ పుట ఆమోదించబడ్డది

44

కవికోకిల గ్రంథావళి


మును స్వగత చమత్కార తారతమ్యమున కనురూపముగ రసవంతముగ నుండవలయు ననియె నిర్ణయింపవచ్చును. పండితరాయలు రసమునందు రామణీయక మున్నదని నుడివి యున్నాఁడు. అంతకన్న రామణీయకమునందు (రమణీయ భావమునందు)రసమున్నదని చెప్పుట సమంజసముగ నుండును.

లోకమున శోక బీభత్సాదిభావములు మనకుఁ గష్టమును గలిగించును. అట్టివి కావ్య సమ్పతము లైనపు డెట్లు ఆనందముఁ గలిగించుచున్నవి? ఎట్లన, అటువంటి భావములు శిల్ప నిపుణుఁ డగు కవిహృదయమునుండి వెడలి సహజకర్కశత్వమును బోనాడి, లోకోత్తర రమణీయములై అద్భుతానంద సంజనకములయి సహృదయులకు సుఖానుభోగ్యము లగుచున్నవి. కావుననె విషాదాంత నాటకములుగూడ ననుభవింపఁబడుట. కావ్యగతమైన ప్రతిభావమును రుచికరముగ నుండును. ఇందుకు కవియొక్క. శిల్పకల్పనా నైపుణ్యమును, భావనేంద్ర జాలమును గారణము,

రామణీయకము ఇట్టిదని నిర్వచించుటకు సాధ్యము గాని భావము, ఒకేరూపము చూచు వారి హృదయ పరిపాకము: ననుసరించి కొందఱికి సుందరముగను మరికొందఱికి నసహ్యముగను దోఁపవచ్చును. ఇది యందఱికిఁ దెలిసిన విషయమె. లంబాడి వారికిని యెఱుకల వారికిని జాల యింపుగనుండు గవ్వలదండలు దంతపు కడియములు మన యాఁడువారికి నేవ పుట్టించును. వీరికి రమ్యముగ నుండు కాసులదండలు తావళములు మున్నగునవి ఆంగ్లేయ స్త్రీలకు