పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

41


పరస్పర విరుద్ధములగు రసములఁ బుట్టించును. పులిని చూచినపుడు పిఱికివానియందు భయమును, శూరునియందు శౌర్యమును బొటమరించును. భావానుభావములకుఁ గారణ కార్య సంబంధము గలదుగాన, భావము. తీవ్రముగ రేఁగినప్పుడు అనుభావములు తప్పక పుట్టును. మనము గ్రహింపని యెడలఁ బులిని చూచివవానికిఁ గలిగినదిఁ పిఱికితనమా లేక శౌర్యమా యని నిర్ణంయిపఁ జూలము. గడగడ వడఁకుచుఁ గంటనీరు పెట్టుచుఁ బరుగెత్తఁబోయి తొట్రుపడుచుండుటఁ గని అతడు భీతిల్లెననియు, లేక , బొమలు ముడివైచి పండ్లు పటపటఁ గొఱకుచుఁ, గత్తిదూసి పులిపైకి దూకుటనుగని, యాతనియందు శౌర్యము దొనికినదనియు మన మూహింప వచ్చును. వీనికి వ్యభిచారి భావమును దోడ్పడినఁ బ్రధాన భావము పరిపూర్ణత నొందును. అనఁగా మూడు చిన్న దీపపు వత్తు లొకటిగఁ జేరినప్పుడు వేడిమియుఁ . గాంతియు హెచ్చునటుల, మూడుభావములు చేరి యొక స్థాయి భావమయి తీవ్రతను దాల్చును. కావున పరిస్పుటమగు రసము బుట్టింప వలయునన్న బ్రధానభావమునకుఁ బరిపోషకముగ ననుభా వాదులు గూడ వలయును.

ఇఁక రసస్వరూపమును జర్చింతము. స్థాయి భావమో లేక మఱియేదైన నొ క భావమో చర్వితమగునపుడు రసత్వము నొందుచున్నది. అనఁగా ఆభావమును సహృదయుఁడు తన హృదయమునందు నిలిపికొని పలుమాఱు భావించుట వలన ఆనంద ముప్పతిల్లును. రసము ఆనందమాత్ర గ్రాహ్యము, కావున, భావము అనుభవయోగ్యమైనది.