పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

38

కవికోకిల గ్రంథావళి


నిచ్చట వివరింప నవసరము లేదు. సంస్కృతలాక్షణికుల వాద ప్రతివాదములవలనఁ దేలిన సారాంశములను క్రిందఁ బొందుపఱచుచున్నాను :

(1) విభావము (ఆలంబనోద్దీపనములు), అను భావము (సాత్వికము అనుభావము నందె చేరియున్నది.), వ్యభిచారి యని భావములు మూడు విధములు.

(2) విభా వానుభావ వ్యభిచారి సంయోగమువలన నొక భావము పరిపూర్ణతనొంది 'స్థాయి' అని పేర్కొన్న బడుచున్నది.

(3) ఆ స్థాయి భావము, చర్వణమువలన రసత్వము నొందుచున్నది.

(4) భావత్రయ సంయోగము వలన రూపాంతర పరిణామము గలుగుచున్నది. (దధ్యాదులవలె)

(5) [1]*భావ్యమాన భావత్రయములో నేదైన నొకటి రసమగును.

పై సారాంశములను వలసినచోట్ల గ్రహించి విమర్శించెదము.

పాంచ భౌతిక ప్రపంచమును మనము శబ్ద స్పర్శ రూప రస గంధముల వలనఁ దెలిసికొనుచున్నాము. ఇంద్రియములు సాధనమాత్రములు. వాని నుపయోగించునది బుద్ధి. మన మనస్సు పరాయత్తమైనపుడు దగ్గర నిలుచుండు

  1. భావ్యమానో విభావ ఏవ రసః అనుభావ స్తధా,
    వ్యభిచార్యేవ తధా పరిణమతి,

    ఇవి రనగంగాధరమునం దుదహరింపఁ బడినవి.