పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

26

కవికోకిల గ్రంథావళి

జీవితమున కాశ్రయమగునుగాని, తానే జీవితము కాఁ జాలదు.

వక్రోక్తి యొకవిధమైన అలంకారము. అలంకార మస్పుటముగ నున్న వాక్యములకుఁగూడ (అనఁగా అలంకారము తర్కముచే మాత్రము సాధింపఁబడి, దాని మూలమున రాఁదగిన సౌందర్యము. 'యః కౌమార హరః' అను శ్లోకమునందువలె [1]అభావ మయినపుడు) కావ్యత్వము సిద్ధించుచున్నదిగాన, అలంకారములు కొన్ని యెడల నావశ్యకములయ్యు, ఔపచారికములు గావునను, వానికి జీవత్వము లేదు.

ఔచిత్యము అన్నిశిల్పములకుఁ బరమావశ్యక మగు నియమము. ఇది రసపోషకము. సౌందర్యమున కొక యంగము.

ధ్వన్యాత్మకముగాని వాక్యము సైతము కావ్యమని నిరూపింపఁబడియుండుట చేతను, వ్యంగ్య వైభవము ఉత్తమ


  1. శ్లో. యః కౌమాఠహరః నఏవ హిపరస్తా ఏవ చైత్రక్షపా
        స్తేచోన్మీలిత యాలతి సురభయః ప్రౌఢా? కదంబానిలాః,
        సాచైవాస్మి తథాపి తత్ర సురతవ్యాపార లీలా విధౌ
        రేవా రోదసి వేతసీ తరుతలే చేతః నముత్కంఠతే,

    (మమ్మటోదాహృతము.)

    పరస్పర విరుద్ధములగు విభావనావిశేషోక్తుల సాంకర్య మిందు స్ఫుటముగ నున్నదని విశ్వనాథుని యభిప్రాయము. కాని యీ శ్లోకమును మనము చదువునపుడు మనకుఁ గలుగు ఆనందము ఆలంకార మూలకమైనది కాదు. తనమూలకమైనది.