పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/249

ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

243

రతి ఉభయనిష్టముకానిచో, రచన హాస్యాస్పదమగునని రసలుబ్ధుఁడు లక్షణ గ్రంథములలోని కొన్ని ప్రమాణముల నుదాహరించెను. ఈ లాక్షణికులు 'శృంగారానుకృతిర్యాతుసహాసః' అను భరత నిర్వచనమునే యనుకరించి లక్షణము లల్లిరేగాని, సొంతముగ నాలోచించి యందలి భేదముల నరయరైరి. ల రతి ఉభయనిష్ఠము కానియపుడు హాస్యము పుట్టుటకు నాయికా నాయకులలో నొకరియందొ లేక యిరువురందొ లాఘవము (frivolity) అగపడవలయును. అట్లుగాక, యుభయులందును గౌరవమును, seriousness of purpose పొడకట్టునేని హాస్యము పుట్టదు. నాయికకైనను నాయకునికైనను మానము, ఈర్ష్య, క్రోధము; కసి తీర్చుకొన వలయునను తలంపు పుట్టును. ఈ భేదమును లాక్షణికులు (గతానుగతికు లగుటవలన) గుర్తింపలేదు. ఇట్టి విషయములందుఁ గేవలము సచేతనుల యనుభవమేగదా ప్రమాణము!

II

“In short, tragedy is not history in dialogue, History is for tragedy nothing but a storehouse of names where with we are used to associate certain characters,... ...... For the dramatic poet is no historian, he does not relate to us what was once believed to have happened, but he really produces it again before our eyes, and