పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/152

ఈ పుట ఆమోదించబడ్డది

146

కవికోకిల గ్రంథావళి

కావ్యశోభాకరధర్మములు 'అలంకారములని దండి మతము, వామనుడు దండి యభిప్రాయము ననుసరించి యించుక మార్పుతో “కావ్యం గ్రాహ్యమలంకారాత్” అనియు "సౌందర్యమలంకారః” అనియు నిర్వచించెను. సౌందర్యము సౌందర్యాపాదక హేతువుల సమష్టి ఫలము, ఒక్క కటకాంగదములవలననే సౌందర్యము చేకూరదు.

వామనుని కాలమున గుణములకు ప్రాముఖ్యము కలిగినది. అలంకారములకు ప్రత్యేకత పొడచూపినది. కావ్యమునకు శోభ నాపాదించు ధర్మములు గుణములనియు తదతిశయహేతువులు అలంకారములనియు గుణశూన్యమైన కావ్యము అలంకారయుతమయ్యు శోభావహము కాదనియు వామనుని యభిప్రాయము.

సంస్కృతలక్షణ గ్రంథములు క్రీస్తువెనుక నాలుగైదు శతాబ్దుల మధ్య ప్రభవించి క్రమక్రమముగ వ్యాపింప జొచ్చినవి, లక్షణ గ్రంథముల అధికారము హెచ్చినవెనుక రచింపబడిన కావ్యములు చాలవరకు స్వతంత్ర రచనా విధానమును గోల్పోయి అలంకార గ్రంథములలోని లక్షణములకు ఉదాహరణ ప్రాయములైనవి.

లాక్షణికులు తార్కికులుగావున అలంకారములు వారి పృథఃకరణశక్తి సనుసరించియు, సూక్ష్మాతి సూక్ష్మభేదగ్రహణ బుద్దిననుసరించియు కాలక్రమమున పెచ్చు పెరిగినవి. మనము ఏ మాట మాటాడినను అది యేదో యొక యలంకారమగును. అలంకారములు శరీరముకంటే