ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కవి జీవితములు



తము వ్యాపక మైనది. రాజనరేంద్రుఁడు వేఁగిదేశము వదలి దక్షిణదేశము దండయాత్రకుఁ గా వెళ్లియుండెను. ఆకాలములలో నతని పుత్రులు మొదలగువా రీవేఁగిదేశమును బాలింపుచుండిరి. రాజనరేంద్రునిచే నీగ్రంథము ఆంధ్రీకరించుటకుం గోరఁబడుట వేదమతప్రాబల్యమైనకాలములో నని యూహింప ననువై యుండును. అతఁ డాగ్రంథము కొనసాగువఱకును ఈ దేశమున నుండినను నుండకున్నను జీవించియున్నను లేకున్నను నతనిస్థానమునందు వచ్చియున్నను నతనికుటుంబమువారు దానిం బూర్తిచేయించుటకు యత్నింపవచ్చును. రాజనరేంద్రునకుం జివరకాలములోఁ జోళదేశముగూడ వచ్చియున్నది. కావున నాచోళదేశమునకు కాంచీపురము ముఖ్యపట్టణమై యుండుటంబట్టియు నచటికి నెల్లూరు సమీప మగుటంబట్టియు నా నెల్లూరిలోఁ దిక్కన సోమయాజివంటి ప్రసిద్ధాంధ్రకవి యున్నాఁ డని వినుటచేతను రాజనరేంద్రుఁనిస్థానికులు తిక్కనసోమయాజికొఱకుఁ బ్రయత్నము చేసియుండ వచ్చును. కావున నన్నయభట్టు మృతినొందుసమయమునకు రాజనరేంద్రుఁడు తనకుమారునియొద్దను గాంచీపురములోనైన నుండవచ్చును. అటు గాకున్న నతఁడు కాంచీపురిలోఁ బ్రభుత్వము చేయుచు రాజమహేంద్రవరపుపండితులను తనకడ నుంచుకొని యైన నుండవచ్చును. అట్లు పైపండితులు చేయుచున్నగ్రంథమునకు విఘ్నము రాఁగా తాజనరేంద్రుఁడు గాని, రాజేంద్రచోళుఁ డనునతనిపుత్రుఁడు గాని యచ్చటనే దానిఁ బూర్తిచేయుటకు యత్నించి యుండవచ్చును. అట్లైనను గ్రంథము రాజనరేంద్రునిపేరిట నారంభింపఁబడెను. గావున నాతనిపేరిటనే అది పూర్తిచేయించుట కభ్యంతర ముండదు. కాఁబట్టి దేశములో నుండువాడుక ననుసరించి నన్న యభట్టునకు మతిభ్రమణము కల్గునప్పటి కీరాజు రాజ్యముచేయుచుండె ననియు, నన్నయభట్టారకుఁడే తిక్కన సోమయాజిని నియమించినాఁ డనియును, నిశ్చయింతము. తిక్కనసోమయాజికాలముంగూర్చి యతనిచారిత్రములో విశేషించి వ్రాయుచున్నా