ఈ పుటను అచ్చుదిద్దలేదు

712

కవి జీవితములు.

ఇతఁడు తనవిషయమై యీక్రిందిపద్యంబువ్రాసికొనియెను. _

"క. హరితసగోత్రోత్పన్నుఁడ, వరతరమగునులచనాడువంశ్యుఁడ లక్ష్మీ
     కరకర్ణాటకులుండను, ధర వేంకటరమణుపేరఁ దనరినవాఁడన్."

దీనింబట్టి యీకవి కరణకమ్మ లనఁబడు కన్నడశాఖాబ్రాహ్మణులలోనివాఁ డనియు నితనినాఁ డీభేదానుసారముగా నులచనాటివాఁ డని చెప్ప నొప్పినట్లు గాన్పించు.

కవికృతగ్రంథములు.

"గీ. రమ్యతర మైనయధ్యాత్మారామచరిత, నాంథ్ర మొనరించి పిమ్మట నాత్మభాషఁ
     బూని మానగుగయునుపాఖ్యాన మనెడు, గ్రంథము రచించితిని బుద్ధికలిమికొలఁది."

(1) ఆంధ్రములో నధ్యాత్మరామాయణము.

(2) కన్నడములో గయోపాఖ్యానము.

ప్రస్తుతగ్రంథముంగూర్చి యీక్రిందివిధంబుగ నింకొకపద్యంబు జెప్పెను అదెట్లన్నను :_

"గీ. రహిని జన్మాదిరహితపరాత్పరరత్వ, విమలసత్యాపరోక్షసంవిత్ప్రసాద
     దక్షిణం బగుమోక్షశాస్త్రంబు నొకటి, నిపుడు సేసెదఁ దత్క్రమ మెట్టి దనిన."

ఈకవి యాశ్వాసాంత గద్యముంబట్టి యథామాతృకముగాఁ దెనిఁగించినట్లు కాన్పించును.

"ఇది శ్రీ సీతారామకృపారసఝరీపాత్ర, హరితసగోత్రపవిత్ర, ఉలచనాడు వంశపయః పయోధికైరవమిత్ర, సజ్జనవర్ణ నీయచరిత్ర, నృసింహవిఖ్యాత భూసురవర్యపుత్త్ర వేంకటరమణ ప్రణీతం బగుశ్రీమద్యథావాల్మీకీయ వాసిష్ఠరామాయణము సర్వంబును సంపూర్ణము."

ఈకవి మఱియొకచో సంస్కృతములోని వాల్మీకికృత వాసిష్ఠరామాయణకవితావిశేషంబులు దానిం దెనిగించుటకుఁ గల స్వశక్తి లోపమును దెల్పునట్లుగా నొకయుపన్యాసంబు వ్రాసె. అది తన నిజ మగు శక్తిలోపంబును వివరించుటకుఁ గాకున్న నెవ్వరైనఁ దనగ్రంథంబు సింగకవి గ్రంథంబుతో సరిచేసి అది లెస్సయై యున్న దనియు నిం దట్టివిశేషంబులు లేవనుశంక నంది దీని నిరసించెద రనుసంకోచముతోఁ జేసియుండిన నుండవచ్చును. ఆవచనభాగంబుమాత్ర మిట వివరించెదను.