ఈ పుటను అచ్చుదిద్దలేదు

708

కవి జీవితములు.

చేసినట్లు కనుపించులెక్కవలన నతనివయస్సు నంతే యై యుండు నని యూహింపఁగూడదుగదా. కావున సింగనకవికాల మాతనితండ్రి యగు నయ్యలమంత్రికిఁ బ్రభుఁ డగుననవోతభూపాలునికాలముంబట్టికూడఁ గొంచెమెచ్చుతగ్గుగా సరిపడియే యున్న దని చెప్పవచ్చును. పై గ్రంథము

వీ. కవిచరిత్రవిమర్శనము.

లో బ్ర. వీరేశలింగము పంతులవారు సింగకవి (మడికి సింగన్న) చారిత్రములో నతనికాలనిర్ణయముంగూర్చి కొంత యత్నించి దాని నొకవిధముగా నిర్ణయించిరి. దానింగూర్చి వారువ్రాసినదాని మనమిపుడు పరిశీలించవలసియున్నది. అందు వా రెట్లుగా వ్రాసి రనఁగా :-

"పై పద్యములవలన నీకవి తిక్కనసోమాజుల మనుమరాలి మనుమఁ డగుటయే కాక గోదావరీమండలములోని పెద్దమడికి నివాసుఁ డనికూడ స్పష్టమగుచున్నది."

అనువఱకు ముందుగా నాలోచింతము. ఇదివఱలో మనము చూసిన పద్యములుఁగూడ నివే అయియున్నవి. అందులో మొదటిపద్యమగు

"అతఁడు తిక్కనసోమయాజుల పౌత్రుఁ డై, కొమరారుగుంటూరికొమ్మవిభుని పుత్త్రి బిట్టాంబిక బుధలోకకల్పకవల్లి వివాహమై -"

అని యుండుటం జేసి పుత్త్రుఁ డనుపాఠము సరి కా దని చెప్పియున్నారము. ఇపుడు మన మరసినమార్గముంబట్టి తిక్కనసోమయాజి కీ సింగనకవి మనమరాలిమనమఁడుగాక ముమ్మనమరాలి మనుమఁడుగాఁ దేలును. దానివలన గలుగుభేదము కలుగదనియే భావించెదము. ఇఁకఁ దరువాయి వాక్యములను బరిశీలింపవలసియున్నది.

"ఈకవి పద్మపురాణమునకుఁ గృతినాయకునిఁగాఁ జేసినకందనమంత్రి మా మార్కండేయపురాణమును గృతినందిన గన్నయమంత్రికి యన్నమనుఁ మడౌటకూడఁ గవికాలమును నిర్ణయించుట కనుకూలపడుచున్నది. గన్నయమంత్రి జ్యేష్టభ్రాత గణపతి. గణపతి ద్వితీయపుత్త్రుఁ డబ్బయామాత్యుఁడు. అబ్బయామాత్యుని తృతీయపుత్త్రుఁడు కందనమంత్రి. తిక్కనసోమయాజిశిష్యుఁ డైనమారన తనమార్కండేయపురాణ మంకితముచేసిన గన్నయమంత్రికిఁ గంగనమంత్రి యన్న పౌత్రుఁ డగుటచేతను, కందనమంత్రి కాలములో సింగకవి యుండుటచేతను సింగకవిమారనకుఁ దఱువాత ముప్పదినలుబది