ఈ పుటను అచ్చుదిద్దలేదు

706

కవి జీవితములు.

మగుసీమనే రామగిరిసీమ యని వాడఁబడినట్లును దానిలోపలనే యీప్రభునివలన సింగకవి కనేకవృత్తులు గ్రామము లీయంబడిన ట్లీవఱకే వివరించియున్నాను. ఈరామగిరి పట్టణమునకు నీగ్రంథకాలమునాఁటికి సబ్బినాటిరాష్ట్రమని పేరున్నట్లుగా నది గౌతమీనదికి దక్షిణభాగంబున నున్నట్లుగా వివరించియే యున్నాము. ఇట్టి రామగిరిపట్టణమునకు వేఁగిదేశములోని (ప్రస్తుతపు గోదావరిజిల్లాలోని) పెద్దమనికి గ్రామమునకుఁ గొంచెమెచ్చుతగ్గుగా నెలదినముల ప్రయాణము పూర్వ ముండియుండు. అట్టి పట్టణములో గాఁపురముగా నుండుసింగనకవి కాతనితండ్రి సంపాదించిన పెద్దమనికింబట్టి మడికిసింగన యని చెప్పటంకంటె నీతఁడు స్థిరపడి గ్రంథరచనచేఁ బ్రసిద్ధినందినందున రామగిరి సింగన యని పిలుచుటయే మిగుల ననుకూల మని చెప్పి యితనియింటిపేరు రామగిరియని సవరించి యితని నింతటినుండి రామగిరి సింగన యని చెప్పెదము. పైవచనమువలనఁ గృతిపతి యగుగన్నమంత్రి వృత్తాంతము కొంత గోచరమగును. దానినే పద్మపురాణోత్తరఖండములోగొంతవిపులముగావివరించి యీసింగకవిచెప్పెను. ఆకృతిపతి స్వకీయాస్థానమంటపంబునఁగూర్చుండి కవిని గ్రంథరచనకై బిలిపించిన వృత్తాంతంబు నీక్రింద వివరింపుచున్నాఁడు. అదెట్లనిన :-

"వ. సప్తసంతానంబుల నుత్తరోత్తరంబు లగుకీర్తి సుకృతంబులకు మూలంబు కృతిపతిత్వంబుగా నిశ్చయించి, యష్టాదశపురాణంబులందును, సాత్త్వికంబునుం బరమ ధర్మార్థమోక్షప్రదంబును, విష్ణుకథాప్రధానంబును నగుపద్మపురాణంబు తెనుంగు సేయం దలంచి"

క. ఆపరమేశ్వరమకుట, వ్యాపృతగంగాప్రవాహవరకవితాస
    ల్లాపుఁ డగుకవిని సింగనఁ, జేపట్టక కీర్తిగలదె శ్రీమంతులకున్."

అని సింగనకవిం బిలువనంపించిన ట్లున్నది.

కవివంశావళీసంగ్రహము.

"చ. అనిపొగడంగఁ బెం పెసగునయ్యలమంత్రికి సింగమాంబకున్
      దనయుని విష్ణుమంగళకథానుముఖాత్మునినిత్య సౌమ్యవ
      ర్తను శుభలీలు నవ్యకవితారసపోషణవాగ్విలాసుభూ
      జనసుతసింగ నార్యు గుణసాగరు నన్ బిలిపించి యర్మిలిన్."