ఈ పుటను అచ్చుదిద్దలేదు

704

కవి జీవితములు.

అగును. పై లెక్కనుబట్టి కృతిపతి యగుకందనమంత్రియుఁ గొంచెమెచ్చు తగ్గుగా నాకాలమువాఁడే అయియుండె. కావున నీయిర్వురును శా. స. 1300 ల కాలము వారని నిశ్చయించెదముగాక.

2. గుర్తుగల మల్లనమంత్రి.

ఇతనింగూర్చి చెప్పంబడినపద్యము విశేషచారిత్రాంశములం జెప్పునది కాకున్న నీమల్లన మంత్రి స్థలాదికములం దెలియం జేయును. అది యెట్లున్నదనఁగా :_

"ఉ. అశతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు నంద్ర చంద్రికా
      కాశసమానమూర్తి యగుగౌరమమల్లనమంత్రి దిక్కులన్
      వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడికట్టి కట్టరా
      మేశుఁ బ్రతిష్ఠచేసి నుతికెక్కిన నమ్మొలగూరివాకిటన్."

దీనింబట్టి ఇతనిస్థలము మొలగూ రని తేలినది.

3. గుర్తుగల కేసనామాత్యునివిశేషములు.

ఇతఁడు కృతిపతి యగుకందనామాత్యునకు జ్యేష్ఠభ్రాత. ఇతఁడును కుమారముప్పభూపాలునిమంత్రి యై యున్న ట్లుండుటం జేసి ప్రథమములో నితఁడే మంత్రిగా నుండె ననియు నితనియనంతరము కందనమంత్రి పైరాజునకు మంత్రిగా నుందెననియు నూహింపనై యున్నది. ఈ క్రింద నుదహరింపఁబడు సీసపాదమువలనఁ గేసనమంత్రి ముప్పభూపాలుని మంత్రి యగుట స్పష్ట మగుచున్నది. ఎట్లన .-

"తననీతి ముప్పదిధరణీశుఁ డేలెడి, ధరణికి వజ్రపంజరము గాఁగ"

ఇతఁడు గొన్నిధర్మ కార్యములు చేసినట్లు మఱియొకపద్యము వలనఁ గాన్పించు ఎట్లన్నను :_

"చ. అతులితలీలఁ గేసనచివాగ్రణి ధర్మపురంబునందుసం
      చితముగ నన్న సత్త్ర మిడి శ్రీనరసింహున కుత్సవంబులన్
      సతతమహోపచారములు సల్పుచు రామగిరీంద్రమందు సు
      స్థితి గుడిఁ గట్టి విష్ణుని ప్రతిష్ఠ యొనర్చె నుదాత్తసంపదన్."

ఈ పయిం జెప్పబడ్డ ధర్మపురి ప్రస్తుతములో నిజామువారిపాలన క్రింద నుండునది. దీనిసమీపములోనివే మంథెన, కాళేశ్వరములు. ఈధర్మ