ఈ పుటను అచ్చుదిద్దలేదు

698

కవి జీవితములు.

   స్థిరతరారామతతులు సుక్షేత్రములును, బెక్కు లార్జించి సితకీర్తిపెంపుమిగిలి
   యఖిలజగదన్న దాత నా నవనిఁ బరఁగె, మనుజమం దారుఁ డల్లాడమంత్రివరుఁడు."

ఇందలి ప్రభుం డగుతొయ్యేటి అనవోతభూపాలుఁ డెవరను నొకశంక వొడమెడిని. అతఁ డెవ్వఁడో తెలిసినపిమ్మట నతనికాలము నతనిమంత్రియు సింగనకవికిఁ దండ్రియు నగునయ్యలుమంత్రికాలముం దెలియఁగలదు. ఆపని అవసరమగునెడలఁ జేయుదము.

సింగనమంత్రి గ్రామములు.

ప్రస్తుతములో సింగనకవికిం బ్రభుం డగుకుమారముప్పభూపాలునివలనఁ గవి కియ్యంబడినగ్రామాదులఁ దెలుపుపద్యమును, ఆముప్పభూపాలుంగూర్చి యీగ్రంథములో నెంతవఱకు వివరింపఁబడినదో దానిని మాత్రము తెలిపి యింతకంటె విపులముగా నున్న పద్మపురాణోత్తరఖండములోని పై రాజువిశేషములంబట్టి కాలనిర్ణయాదికములం జేసెదము. సింగకవి కిచ్చినగ్రామాదికములం దెల్పుపద్యము -

"గీ. ఆమహావిభుచేత రామాద్రిసీమఁ, బెక్కువృత్తులు గ్రామముల్ వెలయఁ గాంచి
     యతనియాశ్రితులందెల్ల నధికుఁ డనగఁ, జతురుఁ డన ధన్యుఁ డన సడిసన్న వాఁడ."

కుమారముప్పభూపాలుంగూర్చి

"క. కూనయముప్పనృపాలుని, నూనుం డగు తెలుఁగువిభుని సుందరిమల్లాం
     బానందనుఁ డగుముప్పది, భూనాథుని సుకవివరుఁడ బుధసన్ను తుఁడన్."

ఇతనివిశేషములు పద్మపురాణోత్తరఖండకృతిముఖములోన వివరించెద నని చెప్పియున్నానుగావున వానికి ముందుగా నీవాసిష్ఠరామాయణ గ్రంథకథాదులంగూర్చియు కవిశయ్యాదులంగూర్చియు కవివ్రాసిన కొన్ని వాక్యములను వివరించెదను. మొదట వివరించిన వచనములో

గ్రంథవిశేషములు.

"వెండియుఁ గవిత్వతత్త్వరచనా కౌతుకంబునం జిత్తంబుజొత్తిల్ల నొక్కకృతిం జెప్పంబూనితి. ఏందేనిఖిలభూతాంతర్యామియు నిగమార్థగోచరుండును, నిత్యసత్యజ్ఞానానందశుద్ధాంతరంగుండును, నిశ్చలానందయోగీంద్రహృదయుండును, నిశ్శ్రేయసానందఫలప్రదాయకుండును, నిర్మలచిదాభానుండును, నిరాకారుండును, నిర్గుణబ్రహ్మంబునగు నారాయణుం డొక్క రుండుదక్క నన్యంబు లేదనియును, బ్రహ్మాదిచేతను లతని తేజః