ఈ పుటను అచ్చుదిద్దలేదు

690

కవి జీవితములు.

డఁగా నతని దొరనుచేసి ఫౌంజుదారుని కడకుం గొంపోయి తిరుగ నతనికి బ్రభుత్వమును స్థిరపఱిచినవాఁ డీవెన్నెలకంటి వెంగనమంత్రియే. ఆ కారణమున నతనిపుత్త్రులేవురును వేజెళ్లవారి మంత్రులే అని వివరింపఁబడియున్నది. ఆవివరము ముందు వివరించెదను. ఈ వెంగయ్య మంత్రివృత్తాంతములో నింకొక్కటికూడ వ్రాయవలసియున్నది. అది యెద్దియనగా శ్రీరంగరాయలమెప్పు గొని పంచవన్నె లడాలు తెచ్చెనని. ఈవృత్తాంతమును పర్యాలోచించుటకుఁ బూర్వముకృష్ణంరాజు రాజ్యకాలము మఱి యొకపరి చూచుకోవలసియున్నది. అది శా. స. 1480 మొదలు 1522 వఱకై యున్నది. ఇఁక విజయనగరరాష్ట్రమున కధికారమున వహించిన సదాశివరాయని మంత్రులుగా మొదటఁ బ్రవేశించి అనంతర మారాజ్యమునకు రాజులయిన తిరుమలదేవ శ్రీరంగరాజులు శా. స. 1474 మొదలు శా. స. 1507 వఱకును వ్యవహరించినట్లు శాసనములవలనఁ గాన్పించు. ఆకాలములో నీవెంగమంత్రి శ్రీరంగరాజును మెప్పించి అతని వలనఁ బైపంచవన్నెలడాలును సంపాదించి తనప్రభుఁడు కృష్ణంరాజున కిచ్చినట్లు కాన్పించు. ఈకృష్ణమరాజు రాజ్యము కొండవీడు మొదలు గుడ్లూరివఱకును వ్యాపించి యున్నట్లుగాఁ బైపద్యములోనే యున్నది. అదే గుడ్లూరుపరగణా అనివంశావళిలోఁ జెప్పంబడియె. 6-7-8 గుర్తులుగలవారలు పై వెంగమంత్రిపుత్త్రులు. వీరిలో నాఱవగుర్తుగల వెంకన్న అందఱలోఁ జిన్నవాఁడు. అతఁడు పైభీమవరగ్రామములోనే యుండె నని యుండుటచేతఁ దక్కినవారు గుడ్లూరునకుఁ దమప్రభువు పోయినవెంటనే తామును బోయిరనియు, నీ వెంకన్న మాత్ర మట్లుగాఁ బోక తమతొల్లింటి గ్రామములోనే యున్నట్లును దేలుచున్నది. ఆపద్య మెట్లున్నదనఁగా :+

"గీ. సకలప్రజ్ఞావిచక్షణ శాలియైన, వేంకటయసాటివారిని వినఁగలేము
     దానశీలుఁడు నిరతాన్న దానపరుఁడు పరఁగ నతఁ డుండె నాభీమవరమునందు."

ఇతని మూఁడవయన్నయగు (7. గుర్తుగల) రంగప్పవర్ణనము.

"క. రంగప్ప రూపసంపద, రంగప్పఁడు బుద్ధి నమరరాట్ప్రతిముండౌ
     సంగరవిజయుఁ డుదారుఁడు, రంగుగ నాగోలకొండరాజలు మెచ్చన్."