ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

669

   పుత్త్రమిత్రకళత్రాది సహితశ్చ సనాగరిః,
   శ్రీశైలవంశతిలకా న్నృసింహార్యా జ్జగద్గురోః.
   పంచసంస్కారసంపన్నో బభూవ సుమహాయశాః."

ఇఁక 'తిరుమలతాతయ్యమనుమఁడైనసింగరాచార్యుని' అనుదానినాలోచించవలసియున్నది. నృసింహాచారి మొదలు తిరుగ నావంశములో నాపేరు గలవారుగాని దాని పర్యాయనామమగు సింగరాచార్య నామము గలవారుగాని లేకుండుటంబట్టి యీనరసింహాచార్యుని తాతయును తాతాచారిగానే తేలినది. పై విరూపాక్షదేవరాయనికాలము క్రీ. శ. 1470 సమీపకాలముగాఁ గాన్పించు. అనఁగా శా. స. 1390 సమీపగును. మనము పై నూహించిన సింగరాచార్యుఁడు నాకాలమునకే మిక్కిలి వృద్ధుగాఁ గనుపించును. రెడ్డివారికాలముంబట్టి చూచిన నావఱకే యీరాఘవరెడ్డికంటె నతని కవీశ్వరుం డగునీవెన్నెలకంటి సూరనకవి ముదుసలి యై యున్నట్లు తేలినది. కావున నతనికాల మించుమించుగా నంతకుఁ బూర్వమే యగును. పంతులవా రింకొకమార్గముగూడ విశదీకరించిరి. షష్టాశ్వాసాంతమునందలి యొక పద్యములో

   "క, ర్ణాటనరేంద్రదత్తసముదంచిత శాశ్వతరాజ్యవైభవా."

అని రాఘవరెడ్డిని సంబోధించుటచేతను ప్రథమాశ్వాసమునందలి కృతిపతివంశవర్ణనములో

   "........మహిమచేఁ గడ లేనిరాజ్యభాగములు గాంచె."

నని రాఘవరెడ్డి తండ్రి యైనబసవయరెడ్డినిగూర్చి చెప్పియుండుటచేతను, ఈరాఘవరెడ్డియుతండ్రియు కొండవీటిరాజ్యమును కృష్ణదేవరాయని తండ్రితాతలు జయంచి యాక్రమించుకొన్న తరువాత వారిచే నియ్యఁబడిన చిన్న సంస్థానమును బాలించుచుండినట్లు కానుపించు." అని దీనిలోఁ బంతులవారు స్థూలదృష్టి నాలోచించిరిగాని సూక్ష్మముగాఁజూడ లేదు. ఈకథయంతయుఁ బూర్వపక్షమయ్యె నని చెప్పుటకుఁ గొండవీటిసీమ కృష్ణదేవరాయలనాఁడే జయింపఁబడెనని చెప్పుటచే నై యున్నది. ఆవృ