ఈ పుటను అచ్చుదిద్దలేదు

660

కవి జీవితములు.

చారిత్రములోఁ బ్రచురింపంబడిన తిరుమలతాతాచార్యుని వంశావళిం బరీక్షింప నందు సింగర్యనామము లభియింపలేదు. తత్పర్యాయ నాముఁడగు నృసింహాచారి మొదటివాఁడే. అందులో మువ్వురు తాతాచార్యనాము లున్నారు. వా రీసింగరార్యునితరువాతి వారు. అందు మొదటియతనిమనుమనిపేరు శ్రీనివాసాచార్యుఁడు. రెండవయతనిమనుమనిపేరు సుదర్శన లేక సుందరాచార్యులు. మూఁడవయతని మనుమనిపేరు వేంకటాచార్యులు, ఈ మువ్వురిలో నెవరైన నీసింగరాచార్యావరనాము లుండిరేమో తెలియదు. ఉన్నచో దానిం దెలుపుగ్రంథసామగ్రిలేదు. మొదట నృసింహాచార్యు లేమో అను సంశయము మఱియొక స్థలములోఁ దీర్చెదను. నియాస్థానమార్గమునకు విశేషాధారములు లేవు గావున దీనింబట్టి రాఘవరెడ్డి యొక్కయు, నత కవి యగు వెన్నెలకంటి సూరనకవియొక్కయుఁ గాలము ధైర్యముతో నిర్ణయింపఁ జాలను. కావున దీని న్వదలి మార్గాంతరమున నీతనికాలము నిర్ణయింపఁజూచెదను. అట్టిదానికిఁగాను గ్రంథారంభంబున నచ్చటచ్చట వివరింపఁపడిన కొండవీటిరెడ్ల వృత్తాంతము పరిశీలించవలసియున్నది. దానిం దెలుపుటకు సూరకవి కొన్నికొన్ని వాక్యములను వివరించె. వాని నీక్రింద నేకముఖముచేసి చూచెదము గాక. అవి యెట్లనఁగా :-

ప్రాచీను లగురెడ్లవిషయము.

(1) "క. అనవేమమండలేశ్వరుఁ, డును నళ్లయవీరభద్రుఁడును మొదలుగఁ గ
          ల్గిన తొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులఁ గనిరి కృతిముఖంబున ననుచున్."

అనుదీనింబట్టి పైరెడ్డిరాజుల యనంతరకాలములో నీరాఘవరెడ్డి యున్నట్లు తేలును. పై అళ్లయ వీరభద్రరెడ్డి శా. స. 1350 సమీప కాలములో నున్నాఁడు. కావున నీరాఘవరెడ్డి తదనంతరకాలమువాఁ డగుట నిశ్చయమే. వారిరువురకును నడుమ యెంతయవధియున్నదో. తేలవలసియున్నది. దానికై మఱికొన్ని యాధారముల నరయుదము.

2. పైవెన్నెలకంటి సూరయ్యకవితాత యగుసూర్యకవింగూర్చి