ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

653

విద్యాభ్యాసముఁ గొంతచేసియున్నాఁడను. అందలిశాస్త్రములకుఁగాను స్వదేశము వదిలి కాశికిఁ బోయి యిరువది ముప్పది సంవత్సరములు గురుకులవాసముచేసి వానిఁగొంచెము తెలిసికొనివచ్చినాఁడను. వలయునేని మీయాస్థానవిద్వాంసులు నన్ను పరీక్షింపవచ్చును. అని నేను విన్నవింప నామాటలు చెవిఁ బెట్టకయె అబ్బో సంస్కృత పండితులా "తెనుఁగెఱుఁగఁడు సంస్కృతంబు తె న్నే మెఱుఁగున్" అని యుండలేదా ! యని యెగతాళి చేయనారంభించె. అంతటితోఁ బోనీయక పో పో యింటికిఁ బోయి కొన్ని దినములు తెలుఁగు చదువుకొని సమస్యాపూరణ మాంధ్రమునఁ జేయఁగల నేర్పు సంపాదించుకొని మఱియు రమ్మని చెప్పి, సదన్యులు వినుచుండఁ బండితవేషములు వేసుకొని యాచనార్థము వచ్చెడు వారి నింతటినుండి మాకడకుం దోడ్కొని రాఁగూడదని సభ్యులకుం దెల్పుచు యాచకుల ననేకనిందావాక్యముల నదిక్షేపించుచుఁ బూటబత్తెమైన నీ' కుండఁ బొమ్మని సాగఁబనిచె. అనంతరము నేను నాకు సంప్రాప్తమైనయవమానదుఃఖంబు మనంబు దహించుచుండ దానిఁ జల్లార్చుకొనుటకుఁగాని దానికిఁ బ్రతీకార మూహించుటకుఁగాని యసమర్థుండనై యుండ నామిత్రులు గొందఱు నన్నుం బోయి జరిగినవృత్తాంతంబు మీయన్న దమ్ములతో విన్నవించిరమ్మని పంచిరి. కావున నీయవమా దుఃఖము విద్వాంసులు గావున మీతో విన్నవించినఁ గొంతవాయు ననితలంచివాచినాఁడను. నాకు మీరకృతపరిచయులుగావున న్నెఱిఁగించుకొను తలంపుతో వాస్తోదకసమయమున నట్లు మౌనముద్రను ధరియించితిని. అట్టి నాసాహసకార్యమును సైఁచి నన్ను వెంటం గొనిపోయి ఆంధ్రంబున మహాపండితుఁడ ననుకొని గర్వించి పండితుల నలయించు యాచమనాయనిసమస్యలు బూరించి యతనిగుట్టు బయటఁబెట్టి యాతని నాయెదుట నవమానించిన నాతొంటి యవమానంబు వాయును. ఇదియ యేఁ గోరువరము. ఇది నాకులభియించు వఱకు నేను మీయిల్లు వదలువాఁడం గాను. నామనోభీష్టంబు సఫలంబుచేయఁదగునని విన్నవించె. అట్టి మాటలు విని వెంకన్నకవి దత్తప్పకవిని రావించి ఆపండితుని వృత్తాంతంబంతయుఁ దెల్పి యితనికి