ఈ పుటను అచ్చుదిద్దలేదు

642

కవి జీవితములు.

దర్భముం గుదిర్చిన పౌతరాజే మఱియొకగ్రంథములో నాకథనే సందర్భహీనముగాఁ జెప్పునా? కావున నీరెండుకథలును జెప్పినవా రొకరు కాక యిరువురు వేఱ్వేఱుకవు లని నిర్ణయించి యీగ్రంథము నవీన మనియుఁ గల్పితమనియు సిద్ధాంతీకరించెదను.

భోగినీదండకము.

ఇదివఱలో వీరభద్రవిజయ మీపోతరాజకృతంబు కా దని తగినయాధారము లుండుటంబట్టి నిష్కరించియుంటిమి. అటులనే నిష్కర్షింపవలసినయంశ మింకొకటి యున్నది. అది పోత రాజకృత మనిప్రసిద్ధి నొందిన 'భోగినీదండకము.' దీనిం బరిశీలింపఁ దగుగ్రంథములు లేవు. వేంకటగిరిసంస్థానచరిత్రములో నీక్రిందివిధంబుగా వివరింపఁబడియె. ఎట్లన్నను :-

"Biographical Sketches of the Rajahs of Venkatagiri by Mr. T. Rama Rao, in 1875, pages 26-27.

It is highly interesting to learn that the eldest of them (Sarvagna Singma Naidu) was greatly learned in Sanskrit literature, poetry, drama, logic, grammar and rhetoric and that he himself composed a work on the last-mentioned subject called "Singabhupaleyam" His Court is said to have been adorned by several poets among whom were Bammera Potarazu who translated 'Bhagavatam' in telugu, and Srinathudu, the telugu Transletor of 'Naishadham' Sarvagna Singama Naidu formed the subject of a Composition by the former called 'Bhogini Dandakam and of some stray verses by the latter."

పైదానిం బట్టి సర్వజ్ఞసింగమనీనివిశేషములు కొన్ని కానవచ్చును. అయితే దానిలో నతనిసభాపండితులలో భాగవత మాంధ్రీకరించిన బమ్మెరపోతరాజును, నైషధ మాంధ్రీకరించిన శ్రీనాథకవియు నున్నట్లును, పై యిర్వురిలోఁ బోతరాజు 'భోగినీదండకమును' శ్రీనాథుఁడు కొన్నిచాటుధారాపద్యములును సింగమనీనిపైఁ గృతియిచ్చినట్లుగా నున్నది. పైయిర్వురిలో శ్రీనాథకవి యీసింగమనీనిసభాసదులలోని వాఁడు కానట్లును పైగా నతనికి బలవద్వైరి యగుననవేమా రెడ్డియొక్క యాస్థానకవి యనియు నతనికార్యార్థమే సింగమనీనిం జూడఁబోయి