ఈ పుటను అచ్చుదిద్దలేదు

640

కవి జీవితములు.

యెదుట నిలువంబడి కర్తవ్యం బడుగఁగా నీశ్వరశాసనంబుగా నీక్రింది పద్యంబు రచియింపఁబడినది. ఎట్లన్నను :-

"చ. గురుభుజశౌర్య భూరిరణకోవిద మద్భటకోటికెల్ల నీ
      వరయ వరూధినీవరుఁడ వై చని యజ్ఞముగూడ దక్షునిన్
      బరువడిఁ ద్రుంపు మీ వచట బ్రాహ్మణ తేజ మజేయమంటివే
      నరిది మదంశసంభవుఁడ వై తగునీకు నపాధ్య మెయ్యెడన్."

అని యిట్లుగా నాజ్ఞాపింపఁబడినవీరభద్రుం డట్టహాసంబున బయలువెడలి శివసేనాపరివృతుఁ డై దక్షయజ్ఞవాటంబునకు వచ్చి యజ్ఞంబుతోఁగూడ దక్షుని వధించి నిజనివాసం బయినకైలాసంబునకుఁ జనియె నని పోతనామాత్యుఁడు దక్షయజ్ఞపరిసమాప్తిం దెలిపెను.

వీరభద్రవిజయకథోపసంహారవిధానము.

"దాక్షాయణి దేహంబు దొరఁగిన యనంతరము తత్ప్రకారంబు వీక్షించి దక్ష సుఖమంటపంబున సుఖాసీను లై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీతచిత్తులై మూర్తివంతంబు లైన మంత్రంబులు చాలించి పాపకర్ముం డగుదక్షుని నిందించి బ్రహ్మ తనలోకంబునకుఁ బోయె మఱియుఁ దక్కినవారందఱును దమతమనివాసంబులకుం జనిరి తత్సమయంబున"

అని యొకఘట్టము చెప్పంబడినది. దీనిలో నీగ్రంథకర్తవలన యజ్ఞసమాప్తి యెట్టులుగాఁ జేయంబడెననఁగా యజ్ఞశాలలో నొకశవంబు బడియెంగావున నక్కడిఋత్విక్కులందఱు నశుచికారణంబున మూర్తివంతులైనమంత్రంబులు చాలించి యాపాపాత్ము దిట్టుచుం దమతమనివాసంబులకుంజని రని చెప్పిన లోకాచారంబు ననుసరించి యుండు నని యూహించెంగాని యజ్ఞాదులు జరుగుచున్నపుడు యజమానికిని ఋత్విక్కులకును దీక్షామధ్యంబున నుండుటం జేసి అపభృథాంతమువఱకును జాతా శౌచామృతాశౌచంబులు పట్టకుండుట విధిగానిప్రారంభమైనయజ్ఞము పరిసమాప్తినొందింపక ఋత్విక్కులుగానీ యజమానిగానీ తమయిష్టానుసారము వదలివేసిపోఁగూడ దనువిధిగానీ తెలిసియుండలేదు. ఇవి సర్వద్విజులకును దెలియఁదగిన ధర్మంబులే కాని ఇట్టివానిలోఁగూడ నీవీర