ఈ పుటను అచ్చుదిద్దలేదు

636

కవి జీవితములు.

పైవచనములో నాయాగమంటపంబున శుభాసీను లై యున్న సభాసదుల నుద్దేశించి దాక్షాయణి చెప్పినవాక్య మనిగదా యున్నది. అటులైనచో నిగమములును గిరీంద్రులుగూడ నాసభలోనికి వచ్చి సుఖాసీను లై యున్నట్లుచెప్పెడు వివేకహీను లుందురా. గగన చరులారా యని చెప్పినఁ జాలకకావలయును గగనచరాదులార యని విశేషించి చెప్పె. ఇట్టి చేతగానిప్రయోగములు భాగవతకవి చెప్పె ననినచో మీ రామాటలకు నంగీకరించెదరా ? ఇట్లు చెప్పుచుఁ బైకథ కెడమగుచున్నారము. కావునఁ గథలోనికిం దిగుచున్నాఁడను, సభాసదుల నుద్దేశించి పల్కుచున్న వాక్య మంతలోనే దక్షునియెడ సమన్వయించఁబడి యీక్రిందిపద్యములు వ్రాయంబడినవి. ఎట్లన్నను :-

"ఉ. వేదములం దెఱింగినవివేకము లెక్కడఁ బోయె నేఁడు పు
      ణ్యోదయబుద్ధి యెం దణఁగియున్నది నేఁడు తలంపఁ, బొల్లయై,
      నీ దగుదక్షతాద్ఫుతము నీతియు నెక్కడ దాఁగె నేఁడు బ్ర
      హ్మాదులు బోనిప్రీతి యవి యారడివోయెనె నీకు నక్కటా.

శా. ఏరా దక్ష యదక్షమానస వృథా యీదూషణం బేలరా
     యోరీ పాపములెల్లఁ బోవిడువరా యుగ్రాక్షుఁ జేపట్టరా
     వైరం బొప్పదురా శివుం దలపరా వర్ణింపరా రాజితో
     త్కారాత్ముం డగునీలకంఠుఁ దెగడంగా రాదురా దుర్మతీ.

క. చదువుల నాలుగు శివుఁ గని, యెదఁ దలఁచుచు వెదకుఁగాని యెబ్భంగులఁ ద
    త్సదమలరూపము కావున, వదలినమతితోడఁ జిక్కు వలదుర దక్షా.

క. విశ్వములోపలఁ దనరెడు, శాశ్వత మగుశివునిమహిమ చెప్పఁగ నీకున్
    విశ్వాసంబునఁ జెల్లదు, యీశ్వరుమహిమాబ్ధి నీకు నెఱుఁగన్

క. ఈయొడలు రోఁతగాదే, పాయక పరమేశు నొంద పనిసేయంగా
    వేయును నేటికి మాటల, పోయెదురా కీడు నొందఁబూని దురాత్మా."

అను మొదలగుపద్యములు మఱికొన్ని యున్నవి. ఈపద్యములు చదివినమాత్రమున వీరభద్రవిజయగ్రంథకర్త కేవల నీచాతినీచుఁ డనియుఁ దలిదండ్రులు బిడ్డలు 'నీవు ఛీ అంటె నీవు ఛీ' "నీవురండా అంటే నీవు ముండా" అని వచియించుకొనుచు దినముల వెళ్లించునీచజాతులలోఁ