ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

635

త్తాంతము తదనుచరులవలన విని తనమూలముగాఁ దనభార్య కట్టియగౌరవము తటస్థించె నని సిగ్గుపడి అంతటినుండియైనఁ దనకు భయభక్తులు చూపు ననుతలంపుననైన యుండును. పై రెండుకథలం బరిశీలించినచో భాగవతగ్రంథకర్తయు, వీరభద్రవిజయగ్రంథకర్తయు నొక్క రని యెవరైనఁ జెప్ప గమకించెద రేమో నే నూహింపను.

6. సతీదేవి తండ్రితోఁ బల్కినపల్కులు.

సతీదేవి తండ్రివలన నవమానింపఁబడియెంగావున స్త్రీస్వభావముచేతఁ గోపించి తన పెనిమిటియెడలఁ గలమహత్త్వాదికమును దండ్రికిఁ దెల్పి అట్టివానితోడ విరోధము శ్రేయస్కరమైనది కా దనియు నందు మూలమునఁ గల్గెడులాభమునకంటె నష్టమే యెక్కువయైనదనియుఁ జెప్పుటయు లోకసామాన్యధర్మము. అందులో నాతఁడు భగవంతుఁడుగా సతీదేవి భావించుచున్నది కావున నట్టివారియెడలఁ గల్గునసూయమూలమున నైహికాముష్మికములు రెండును జెడు నని తండ్రికి నామె చెప్పుటయు నై సర్గికములే. ఇట్టిచోఁ బైయిర్వురుకవులు నెట్లుగాఁ బైవృత్తాంతముం జెప్పిరో చూచెదముగాక. వీరభద్రవిజయము ప్రథమాశ్వాసములో

"వ. అనవుడు నమ్మహాదేవి కోపవివశ యై యయ్యాగమంటపంబున శుభాసీను లై యున్న సభాసదుల వనలోకించి యిట్లనియె.

చ. నిగమములార ధర్మపదనిర్ణయులార మునీంద్రులార యో
     నిగమ మహాత్ములార భవనిర్ణయులార గిరీంద్రులార భూ
     గగన చరాదులార భవఖండనులార మునీంద్రులార యే
     నిగమములందుఁ జెప్పె శివనింద యెఱింగితి రేనిఁ జెప్పరే."

అని యొకపద్యమున్నది. పాఠకులారా! ముం దీపద్యప్రశంస జేయసెలవొసంగుఁడు. ఒక్కపద్యము పరికించినచో నీపద్యకవి భాగవతకవి యగుపోతనామాత్యుఁ డేమో మీకే బోధకాక మానదు. పోతనామాత్యుఁడు నిద్దురలో జెప్పినను నింతయభాగ్యకవనముం జెప్పఁడుగదా !