ఈ పుటను అచ్చుదిద్దలేదు

628

కవి జీవితములు.

"వ. ఇట్లు దక్షుండు పలికినగర్హితవాక్యంబులు వినిందితంబులుగ నుండినను యథార్థంబున వాస్తవంబు లగుచు భగవంతుం డగురుద్రునందు ననిందితంబు లై స్తుతిరూపంబున నొప్పు తదనంతరంబున రుద్రునకు శాపం బిచ్చి దక్షుండు సదస్యముఖ్యులచే నకృత్యం బని నిషేధింపఁబడి ప్రవృద్ధం బయిన క్రోధంబుతో నిజనివాసంబునకుం జనియె.

అని యుండుటచేతఁ బోతనామాత్యుఁ డిప్పట్ల స్వకపోల కల్పితము గాని స్వాభిప్రాయ ప్రకటనముగాని చేసియుండలేదు. ఇఁక నందికేశ్వర శాపాదికముంగూర్చి వ్రాసెదను. ఎట్లన్నను :-

"అంత గిరీశానుచరాగ్రేసరుం డగునందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించినశాపంబు నతఁడు బల్కిన యనర్హవాక్యంబులును వినికోపారుణితలోచనుం డై యిట్లను ఈ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలంచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శి యై యపరాధంబుఁ గావించె. అట్టిమూఢాత్ముండు తత్త్వ విముఖుం డగు మఱియును గూటధర్మంబు లైననివాసంబుల గ్రామ్యసుఖాకాంక్షలంజేసి సక్తుం డై యర్థవాదంబు లైనవేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు సేయుచు దేహాదికంబులు పాథేయంబు గాఁ దలఁచుచు బుద్ధిచే నాత్మతత్త్వంబు మఱచి వర్తించి పశుప్రాయుం డైస్త్రీకాముండు నగు ఇదియునుంగాక దక్షుం డచిర కాలంబున మేషముఖుండు నగు నని మఱియును.

మ. అనయంబుం దనమానసంబున నవిద్య న్ముఖ్యతత్త్వంబుఁ గా
     గని గౌరీశుఁ దిరస్కరించినయసత్కర్మాత్ము నీదక్షుఁ దా
     మనునర్తించినవారు సంస్మరణ కర్మారంభు లై నిచ్చలున్
     జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.

వ. అదియునుంగాక యీహరద్వేషు లైనద్విజు లర్థవాద బహుళంబు లైనవేద వాక్యంబులవలన మధుగంథసమంబయిన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తులగుదురు మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యు లై దేహాదిపోషణంబు కొఱకు ధరింపఁబడు విద్యాతపోవ్రతంబుఁ గలవారయి ధన దేహేంద్రియంబులందుఁ బ్రీతిఁ బొంది యాచకు లై విహరింతురు అని నందికేశ్వరుండు బ్రాహ్మణుల శపియించె"

అనియున్న పయివాక్యములలో శివనింద లేదు సరికదా యట్టి శివనిందఁ జేయుబ్రాహ్మణులకు (అనఁగా వైష్ణవులకు) అఖండ మయిన శాపమును పెట్టినట్లు పోతనామాత్యుఁడు చెప్పియుండెను. అయిన నంతటితో నాగ్రంథంబు ముగియలేదు గావున ననంతరము వైష్ణవమతస్థుఁ డగునొకఋషి లేచి నందికేశ్వరు శాపంబునకుఁ బ్రతిహతముగా నతనిపక్షమువా రగుశైవులకు శాపముఁ బెట్టి యుండుటను వ్యక్తీకరిం