ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

621

యానకరసప్రధాన సాత్వతీవృత్తులును జెప్పెడి స్వభావము గలవాఁడు. పోతన శృంగార కరుణారసంబులచే నొప్పు కైశికీ వృత్తులును, హాస్య శాంతాద్భుత రసప్రధాన భారతీవృత్తులును జెప్పెడి స్వభావము గలవాఁడు. తిక్కన ప్రత్యక్షశయ్య నుడువ నుత్సహించు. పోతన భక్తిరస మొల్కునట్లు పల్కు. సోమయాజి తెనుఁగుపదంబులు ప్రయోగించుట యందు విశేషాసక్తి కలవాఁడు. పోతన సంస్కృతపద ప్రయోగపటిష్ఠుఁడు శృంగారవర్ణనలఁ దొంటి పురాణకవులలోఁ బోతన కవనంబే మిగుల శ్లాఘనీయంబు. దానిం జూపుటకు రుక్మిణీకల్యాణమునుండి యొకపద్యము చూపెదను. ఎట్లన్నను. -

"సీ. పల్లవవైభవాస్పదములు పదములు, కనకరంభాతిరస్కారు లూరు
      లరుణప్రభామనోహరములు కరములు, కంబుసౌందర్యమంగళము గళము
      మహిత భావాభావ మధ్యంబు, చక్షురుత్సవదాయి చన్నుదోయి
      పరిహ సితా ర్ధేందుపటలంబు నిటలంబు, జితమత్తమధుకరశ్రేణి వేణి

తే. భావజాశుగముల ప్రాపులు చూపులు, కుసుమశరునివింటికొమలు బొమలు
    చిత్తతోషణములు చెలియభాషణములు, జలజవయనముఖము చంద్రసఖము."

రుక్మణీకల్యాణము సత్యభామయుద్ధము మొదలగుపట్లు హరివంశంబున నెఱ్ఱాప్రెగ్గడచే వర్ణితంబులయ్యె. వానిం బరిశోధించిన నీయిరువురకుం గలతారతమ్యంబులు గోచరంబు లగు. శృంగారవర్ణనలు కానిచోట్లను జూచినఁ బోతన శంభుదాసునకు నీ డగు ననియుఁ, గొంచె మతిశయించు ననియుం దోఁచు. దానికి దృష్టాంతముగ హరివంశ భాగవతంబులలోని కొన్నిసమానవర్ణన లున్నపద్యంబుల వివరింతము.

శ్రీరామచరిత్రము.

మ. అమలాంభోజదళాక్షుఁ డక్షతఘనశ్యామాంగుఁ డాజానుదీ
     ర్ఘ మహాబాహుఁడు సంహతోరుకఠినోరస్కుండు సింహోరువి
     క్రమణుం డుద్ధత శౌర్యధుర్యకల నాకల్పుండు కళ్యాణధీ
     రమణీయుండు వెలింగె రాముఁడు గుణారాముండు భూమండలిన్.
                                                 హరి. పూ. భా. ఆశ్వా. 4.