ఈ పుటను అచ్చుదిద్దలేదు

620

కవి జీవితములు.

నిం దుచ్ఛంబు సేయు. దీనికి నప్పకవీయమే దృష్టాంతము. ఏదేని యొకసూత్రంబు సవరించి గ్రంథంబులు నిర్దోషములు చేయుట ముఖ్యముగాని దానినే యుంచి వానిని చెఱుచుట ప్రశస్తము గాదు. ఈదోష మొక్కటి లేకున్నఁ బోతనకృత గ్రంథంబు సలక్షణ మనుటకు సందియంబులేదు. ఈతండు పదశయ్యాదులందుఁ దిక్కనతో సరిసేయం

పోతనపదశయ్యా విశేషములు.

దగువాఁడు. సమానవర్ణన లున్నతావులు చూచిన నీయిరువుర కవనంబునకుం గలసామ్యంబు గోచరంబయ్యెడిని. కావున మన మిపు డొకటిరెండుపద్యంబుల వ్రాయుదము.

"సీ. ప్రాణంబుతోఁగూడ రక్కసిచన్నుల, పాలు ద్రావినప్రౌఢబాలుఁ డితఁడె
      వ్రేల్మిడిఁ జాణూరు విఱిచి లోకముల మె,చ్చించినయాజగజెట్టి యితఁడె
      దుర్వృత్తుఁ డగుకంసుఁ దునిమి యాతనితండ్రిఁ,బట్టంబు గట్టినప్రభుఁ డితండె
      సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గల,కోర్కి దీర్చినరసిం డితండె

తే. వెన్నలును గోపికాచిత్తవృత్తములును, నరసి ముచ్చిల నేర్చినహరి యితండె
    శ్రుతిశిరోభాగములఁదనసుభగచరణ, సరసిజా మోదమునుగూర్చుచతురుఁడితఁడె."
                                                                     భార. ఉద్యో. ప. అ. 3

"సీ. వీఁడఁటే రక్కసి విగతజీవ గఁ జన్ను, బాలుఁ ద్రావినమేటిబాలకుండు
      వీఁడఁటే నందునివెలఁదికి జగమెల్ల, ముఖమందుఁ జూపినముద్దులాఁడు
      వీఁడఁటే మందలో వెన్నలు దొంగిలి, దర్పించి మెక్కినదాఁపరీఁడు
      వీఁడఁటే యలయించి వ్రేతలమానంబుఁ, జూరలాడినలోకసుందరుండు
      వీఁడు లేకున్నపుర మటవీస్థలంబు, వీనిఁ బొందనిజన్మంబు విగతఫలము
      వీనిఁ బల్కని వచనంబు విహగరుతము, వీనిఁ జూడనిచూడ్కులు వృథలు వృథలు."
                                                                భాగ. స్కం. 10. పూ. భా.

ఇ ట్లింక ననేకపద్యంబు లున్నయవి. ఎచ్చోఁ బరిశోధించినను బోతనపాండిత్య విశేషంబులు పూర్వకవులవానితో సమానముగను కొంచెమధికముగ నుండునుగాని న్యూనంబుగ నెన్నండు నుండవు. తిక్కన సంగ్రహ శయ్యకును, బోతన యమకకవనంబునకుం బ్రసిద్ధులు. తిక్కన రౌద్ర భీభత్స రసప్రధానంబు లగునారభటీవృత్తులును వీరభ