ఈ పుటను అచ్చుదిద్దలేదు

616

కవి జీవితములు.

"క. నణ లనురెండక్కరముల, కును వడిఁ బ్రాసంబుఁ బెట్టికొనవచ్చుఁ దగన్
      విను రఱల కిట్లు పెట్టం, జను లళల కభేద మరయ సర్వజ్ఞనిధీ."

వ. ఈచెప్పిన మూఁటిలోపలను మొదలఁ జెప్పిన 'నణలకు' సరసవడియును కడమఁ జెప్పిననళల కభేదవిరతియును గనుక నీరెండును గూర్పవచ్చును. నడుమఁ జెప్పిన రఱలకు 'రయోస్తు నిత్యం స్యాత్‌' అను శబ్దానుశాసన సూత్రము కలిమింజేసి యేకతర యతు లవుటంజేసి కూర్పరాదు. "అటుగావున నీపద్యమును బ్రశస్తము కాదు."

అని యి ట్లప్పకవి కొన్ని చోట్లఁ గవిహృదయంబు గా దనియును వీరందఱు సప్రశస్తముల వ్రాసి రనియుఁ జెప్పియుండెఁ గాని వీరట్లు వ్రాయుటకుఁ గారణం బేమి యని యూహింపఁ డయ్యె. ఇంతియకాక తాఁ జెప్పినదే కవిహృదయ మనియు నొరులు దాని నెఱుఁగరనియుఁ జెప్పుట మఱియు వింతగ నున్న యది. తనకు నూటయేఁబదిసంవత్సరములకుఁ బూర్వంబున నున్న రామాభూషణునిహృదయంబు తనకును బూర్వు లగులక్షణవిలాసమువారికంటెఁ దనకే యెక్కుడుగఁ దెలియు టెట్లు గలుగు? వారిహృదయంబు లిట్లే కావున రలలకును మైత్త్రి యుండఁగూడ దనుటకంటె సర్వజనులకు సుగమం బవుభారతములోనున్న

"క. తెంపును బెంపును గదురని, లింపులు వెఱఁ గంది చూడ రిపుసైన్యములున్
     గంపింపఁ దమబలంబులు, ఱంపిలి బిట్టార్వ సింధురాజుం దాఁకెన్."

అనుపద్యమును సులక్షణసారములో భారతములోనిది గావున పరిహరింపఁ గూడ దని వ్యాఖ్యత వివరించెను. పై పద్యంబునందలి రెండవపాదంబులోని లకారరకారమైత్త్రియును నాల్గవపాదంబున నున్న ఱకార రేఫమైత్త్రియుఁ జూపిన నీయప్పకవిప ల్కెంతశ్లాఘనీయముగ నుండును? కవుల కెంతసంతసంబు గల్గును ? భారతప్రమాణంబు లేకుండఁ జెప్పంబడినయీయప్పకవి పల్కులంగూర్చి యీవిషయంబున నిఁక సంవాదంబు సేయంబనిలేదు. ఈరేఫములు రెండును దఱుచుగ నొకచో నుండుటంజేసి విన వీనులకు సొంపుగ నుండదుగావునఁ బ్రయోగించునపు డెల్లరు సంశయింతురు. అయిన వీని నేఱ్పరింపలేక కవులు