ఈ పుటను అచ్చుదిద్దలేదు

612

కవి జీవితములు.

మైత్త్రీదోష మొకదోషములోనిది గా దనియును, కావునఁ బోతనకృతం బంతయు నిర్దోషంబే యనియు మఱికొందఱ యభిప్రాయంబు. రేఫ గయుమైత్త్రికి సమ్మతించుటచే దోషంబు గల్గు నని యప్పకవి యిట్లు వ్రాయుట స్వాభిప్రాయ స్థాపనంబునకుఁగాని మఱియొకటి గాదు. ఈవిషయం బీతనిచే వ్రాయంబడిన పద్యంబు విచిత్రంబుగ నుండును. పొరపాటున రేఫమైత్త్రి చెప్పిన నది సమ్మతంబు చేతనే చెప్పిన ట్లీతండు వ్రాయు. వీనిమైత్త్రి శాస్త్రసమ్మతము గాకున్న నుంనుట కేరైన నిచ్ఛ యింతురా. అట్టియిచ్ఛ లేకున్నను గొన్నికొన్ని స్థలంబులఁ బ్రమాదంబుచేఁ గొన్ని ప్రయోగంబులు సంప్రాప్తంబులవు. ఇట్టి ప్రమాదము నే స్థిరపఱిచి రేఫమైత్త్రియు స్థిరపఱుచుట న్యాయంబు గాదు. ఒకటి రెండున్నఁబ్రమాదంబుగాని విశేషించియున్నఁ బ్రమాదంబు గా దనవలదు. అది గ్రంథబాహుళ్యమునుబట్టి తటస్థించు. 'ఎంత చెట్టుకంతనీడ' యను నట్లు గ్రంథంబు స్వల్పమయినఁ దప్పులును దానికిఁ దగినట్లే యుండును. అధికమైనదానికిఁ దగినట్లే యుండును. న్యాయబుద్ధిచే నేద్ది యేని గ్రంథంబు చూచి యాకవికి వీనిమైత్త్రికి సమ్మతి యున్నదా లేదా యని యోఁచించునపు డందులోఁ గొన్నిపద్యంబులు ప్రత్యేకించి చూచి దానియథార్థ మారయవలయు. ఇట్టిబుద్ధిచే యోచించినయెడ భాగవతంబున నీలాటియనుమానమునకుఁ గారణ మున్న ట్లేమియుఁ గానరాదు. పోతనామాత్యున కీసూత్రమం దిష్టమే లేకున్నఁ బెక్కులు శకట రేఫములకు మైత్త్రి యున్న పద్యంబు లేల కాన్పించు ? ఇఁక నెచ్చోటనైన వీటిమైత్త్రి కానుపించిన నది ప్రమాద మనక తప్పదు. ఇట్టి ప్రమాదంబు లొరుల కుండుట కేమియబ్బురంబు ? వీనిమైత్త్రి కెంతమాత్రము సమ్మతింపనియప్పకవికే కలవు. దృష్టాంతమునకుఁ గొన్నిటిం జూడఁదగు నని యప్పకవీయంబులోని కొన్ని పద్యంబు లిట వివరించెదను :-

అప్పకవితప్పులు.

"1. క. కేరుచు నొయ్యన డగ్గఱఁ, జేరుచు నురుముష్టిహతికిఁ జిక్కకవేగం
        దాఱు చహంకృతిఁ గ్రమ్మఱ,దూఱు చధోక్షజుఁడు మల్లుఁ ద్రుంచె ననంగన్."