ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

607

క్యంబ మరల నూహించుచుండె. ఇట పోతనయిష్టదైవంబు తద్రూపధారి యై, యాతనిగృహంబునకుం జని పోతనకూఁతుం బిలచి పుస్తకము దెప్పించి యం దున్న యసంపూర్ణవాక్యంబు సూచి, "సౌధం బందాపల" అని వ్రాసి దాని నాపె కొసంగి తా నంతర్ధానంబు నొందె. పోతనకు రహస్యస్థలంబున నీవాక్యంబ స్ఫురింప వైళంబుగ నిలుసేరి తనపొత్తంబు మరలఁ గైకొని యందున్న స్వమనోగోచరార్థంబుఁ జూచి యత్యాశ్చర్యంబునఁ గూఁతుఁ బిలచి దానియం దెవ్వరు వ్రాసి యుండి రని యడిగె. అనుడు నాపె 'నీవకదా యింతకుము న్నిటకు నేతెంచి వ్రాసియుంటివి.' అనినం గూఁతుపల్కులు విని కొంతతడవు చింతించి యి ట్లనియె. అమ్మా నీపుణ్యం బెంతయు శ్లాఘనీయంబు. నీక గపడినమత్స్వరూపధారుం డాత్మారాముం డగురాముండుగాని యే గాను. అని తెల్పి ప్రచ్ఛనుండై తనవెనువెంట నంటి తిరుగునించువిల్దంట తండ్రికి మ్రొక్కి ప్రసన్నుండ వగుదుగా కని సంతసంబున నాపద్యంబు పూర్ణంబు సేసె. పిమ్మట నాస్కంధంబును ముగించెను.

శ్రీనాథునియాక్షేపము.

అంత శ్రీనాథుం డొకదినంబున మరలఁ జనుదెంచి పోతన వ్రాసినయష్టమస్కంధముఁ జూచి యందున్న

"మ. సిరికింజెప్పఁడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁ డే
       పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
       తరధమ్మిల్లము చక్క నొత్తఁడు వివాదప్రోద్ధతశ్రీకుచో
       పరిచేలాంచల మైన వీడఁడు గజప్రాణావనోత్సాహి యై."

అనుపద్యంబుఁ జూచి పోతనం బిలిచి బావా నా కీపద్యంబు సమ్మతంబు గాకున్నదిసుమీ అని యిట్లనియె. సిరికిఁ జెప్పఁడు. శంఖచక్రములఁ బట్టడు. తదితరసాధనముల ముట్టఁడు, ఊరక గజేంద్రుం జూడ విష్ణుండు సనియె నని వ్రాసితివి. అతండు పరికరరహితుం డై యేమిసేయం జనె. ఇట్లు వ్రాయుటంజేసి నీవ్రాఁత యుక్తి యుక్తముగ నుండినట్లు గానరాదు. అనుడుఁ బోతన యిట్లనియె. భక్తా