ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

605



కర్ణాటప్రభుఁడు వచ్చుట.

జాని భాగఫతనామంబుఁ దలంచి యిట్లు చింతించె. బహుదినంబులాయెఁ బోతన భాగవతంబు దెనెఁగించుచుండె నని వింటిమి. ఇంతకు నాతండు రాకుండుటకుఁ గారణం బేమి. మృగయావినోదమిషంబున నతం డుండు దేశంబునకుఁ బోయివత్తుఁగాక యని బయలువెడలి యాతనియూరు సేరి యాతనిం బిలువ దూతలంబనిచె. అత్తఱిఁ బోతనామాత్యుండు భాగవత తృతీయస్కంధంబున శ్రీయజ్ఞ వరాహావతారఘట్టంబు దెనిఁగించుచుండె. భక్తపరాధీనుండగు నారాయణుండు పోతనతో నెల్లపుడు లీలావినోదంబులఁ గాలంబు గడుపుచుండుఁగావున వర్ణితవరాహ రూపంబున నచ్చో విహరించుచుండె భూవిభుని బంట్లు వచ్చిన వత్తాంతమంతయు నెఱింగి యా దేవుండు భక్తరక్షణార్థంబు తద్ద్వారోపరిభాగంబున నూక్ష్మగాత్రంబునఁ గూర్చుండియుండె. భటకోటి లోనికిఁ జననుద్యుక్తు లగుడుఁ దనదేహంబు హుంకారధ్వనితోఁ బెంచి వారి నదల్చిన నా రాజకింకరులు తమయొడయనికడ కేఁగి సంప్రాప్త మగునంకిలిఁ దెల్ప నాతండు శంకలుడుగుం డని భయంకర సేనాపరివృతుం డై చని కిటిస్వామిం గని సామాన్యవరాహంబని యెంచి పంది కై యిటు భయమంద నేల? చూడుఁడు. నే నివుడ దీని మడియింతు. అని తన సేనానులం బురికొల్పి పొడువుఁడు పొడువుఁడు పెంపు డింపు: డనుచు వెంట నంటె. అంత నాక్రోడంబు సక్రోధం బై కన్నుల నిప్పు లొలుక వారినందఱఁ దనకోప పావకునకు నింధనీభూతులఁ జేయఁదలంచి విజృంభించి దంతపహతి నరాతిచమూపతుల నింతింతలు తునియలుగ విదారించి పొట్టలు చించి మించె. ఇట్లుండుపొలికలనిం గాంచి యా రా జిట్లు చింతించె. ఏమీ యీయద్భుతంబు! ఇక్కిటి యొక్కటియ:మదీయ సేన నుక్కడంచె. నే నొక్కండ దీనిపని చక్కఁ జేసెద నని మిక్కుటంపు కోపంబున ధిక్కరింపుచు నలుప్రక్కలం బరికించుచో నయ్యాదివరాహం బవార్యతర శౌర్యంబున మాఱు లేనివిహారంబు సల్పుచు ధర బొరియగఁ ద్రవ్వుచుఁ జెల రేఁగియుండె.