ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

603

గ్రామనామముగాక పౌరుషనామమే అగునెడల "కందన ” అను పద్మ పురాణోత్తరఖండ కృతిపతియొక్క వంశస్థుఁడు కానోవును. అయితే తగినన్ని ఆధారములు లేనిదే దీనిం బెంచివ్రాయఁగూడదుగావున దీని నిల్పెదను.

భాగవతాంధ్రకవులు.

ఈక్రింద సంప్రదాయజ్ఞులవలన విన్నంతవఱకు నావలన నిదివఱలో వివరింపఁబడిన గాథలు పైకథాసందర్భములకు వ్యతిరేకించనట్లుగా దిద్ది పునరుక్తి లేకుండఁ జేసి వివరించెదను

శ్రీనాథుడు కర్ణాటకునికిఁ. గృతి నిప్పింపవచ్చుట.

ఇదివఱలో నీభాగవత గ్రంథమును గృతియిమ్మని రావుసింగన కోరినట్లు దానిం జేయకుంట కలిగి యాతఁ డపకారము చేసె ననియును జెప్పియున్నాము. అటువలేనే కర్ణాటకప్రభుఁడుగూడ నీభాగవత గ్రంథము తనకు గృతినిప్పింపవలయు నని కోరి తనమిత్త్రుండును, పోతనకు బంధువుఁడు నగు శ్రీనాథకవిం బంచినట్లును, అతఁడు వచ్చువఱకుఁ బోతరాజు వ్యవసాయము చేయచు పొలముగట్టునఁ గూర్చుండఁగా 'హాలీకులకు మీకుం గుశలంబె' అని యడుగుడుఁ బోతన యీక్రిందిపద్యంబు చదివినట్లును గలదు. ఎట్లన్నను :-

"ఉ. బాలరసాలసాలనవపల్లవ కోమలకావ్యకన్యకం.
      గూళుల కిచ్చి యాపడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
      హాలికు లైన నేమి గహనాంతరసీమలఁ గందమూలకౌ
      ద్గాలికు లైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై."

అట్టిమాటకు శ్రీనాథుడు సమాధానము చెప్పఁజూలక నీవు వచించినది నిజమే ప్రపంచములో ధనికునకు నేకొఱఁత యుండదు. “ధన మూల మిదం జగత్' అని యుండ లేదా ! బ్రతికియున్నంతవఱకు నింత యన్నముం బట్టయుఁ గలిగియుండవలెఁగదా! నీ కంతయిష్ట మున్న మఱి యొకకృతి దేవున కిమ్ము. ఇప్డు నాపలు కాలించి నీభాగవతంబుఁ గర్ణాటమహీపాలునకుఁ గృతియొసంగి సంపదల నందుము. దీనికి మాఱువలి