ఈ పుటను అచ్చుదిద్దలేదు

598

కవి జీవితములు.

తములుగా నున్నవి. పోతన భాగవతంబునం దంతట వ్యాసకృత శ్లోకముల యభిప్రాయమును వదలక సరిగా నాంధ్రీకరించినాఁడు. ఇ ట్లాంధ్రీకరించుట యెంతయు శ్లాఘాపాత్ర మైనపని యై యున్నది. ఈ గ్రం

అన్యకవిరచితగ్రంథ ప్రక్షేపకారణము.

థము రామాయణ భారతములవలె నేకారణముననో యొక్క కవివలనఁ బూరింపఁబడక తచ్ఛిష్యులును తన్మిత్త్రులును నగుమఱికొందఱ వలనఁ బూర్ణంబుచేయఁబడినట్లుగాఁ గాన్పించును. దీనికి దేశదేశములలో వేఱు వేఱు కథలు వ్యాపించియున్నవి. అవి నమ్ముటకుంగాని నమ్మ మని పరిహరించుటకుఁగాని వ్రాఁతమూలము లగునాధారము లెవ్వియుఁ గానరావు. ఆంధ్రభాగవతమును ముద్రించి ప్రకటించిన వారు బమ్మెరపోత నామాత్యుని జన్మకర్మ ప్రభావములు తెలిపెడువచన రూపం బగుప్రాచీనపండితజనలిఖితగ్రంథంబును తాము తెప్పించి దానిం బట్టి తాము వ్రాసిన చారిత్రము వ్రాసియుంటి మని చెప్పిరి. దాని సంగ్రహమును చేసి వారు వ్రాసి ప్రకటించుటకంటె మూలగ్రంథమునే ప్రకటించిన లోకోపకారముగ నుండును. అట్టిమూలగ్రంథము లేనిదే ఆకథ యెడ నేయభిప్రాయంబు నీయ వీలుపడదు. అట్టిగ్రంథంబు వచ్చి యధార్థ కథనుసూచించువఱకును పోతన తనశిష్యులకుఁ గొంతభాగమును మిత్త్రులకుఁ గొంతభాగము నిచ్చి తాను కొంతభాగముఁ గొని పెద్దగ్రంథము గావున దీనిని పరిసమాప్తి నొందించె నని చెప్పిన నొప్పియుండును. అట్లు నిశ్చయించి దీనిలో నుండెడు నన్యకవిరచనంగూర్చి వ్రాయుదము. ఈ భాగవతములోని పంచమ షష్ఠ ఏకాదశ స్కంధములు అన్యకవిరచితములుగాఁ గాన్పించు. అట్టివానిని రచియించిన వానింగూర్చి వ్రాయవలసియున్నది.

ఆంధ్రభాగవత కవులు.

మనము పై నూహించినయూహ కనుగుణముగనే భాగవతము భాగములుగా విడదీయఁబడినచో పోతరాజు భాగమునకు (6) స్కం