ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

597

చి ప్రథమస్కంధము చివరనుండియును శ్రీరాముని సంబోధించి అవదరింపు మని చెప్పినట్లు కాన్పించును. అయితే తాను గంగాతీరంబున మహేశ్వరధ్యానంబు సేయుచుఁ గించిదున్మీతలోచనుం డై యుండునపు డొకరాజ్యముఖ్యుఁడు గన్పించె ననియును నాతఁడు తాను శ్రీరాముండ నైనట్లు తనపేరిట శ్రీమహాభాగవతముఁ దెనిగింపు మనికోరినట్లుగా మాత్రము వ్రాయంబడియున్నది. దానికిఁ బోతన తనయంగీకారము చెప్పినట్లుగాఁ గానుపించదు. ఈక్రిందిపద్యము తాను మేల్కాంచి తన మనంబులో ననుకొనినట్లుగాఁ గానుపించదు. ఈక్రిందిపద్యము తాను మేల్కాంచి తన మనంబులో ననుకొనినట్లుగాఁ గాన్పించును.

"క. పలికెడిది భాగవత మఁట, పలికించెడివాఁడు రామభద్రుండఁట నేఁ
     బలికిన భవహర మగు నఁట, పలికెద వేఱొండుగాథ పలుకఁగ నేలా."

దీనింబట్టిచూడ నారాజశేఖరునకుఁ గృతినిచ్చెద నని పోతరాజు సన్నుద్ధుః డైనట్లు కాన్పించదు. ఈపద్యమునకు మఱియొక తాత్పర్యమే చెప్పవచ్చినయెడల దీని తర్వాయిని వెంటనే వచ్చిన షష్ఠ్యంతములు శ్రీకృష్ణునిపేరిట నుండ దీనినంతయుం జూచినచో జిదానందయోగీంద్రుని కథయును, శ్రీరామ మంత్రోపాసనంబును రెండును కల్పనాకథలుగా నూహింపవలసియున్నది. గీర్వాణభాగవతగ్రంథసంఖ్య యిరువది

ఆంధ్రభాగవత గ్రంథపద్యాదికము.

రెండువేలు. ఆంధ్రంబున ముప్పదివేలవఱకును భాగవతగ్రంథ సంఖ్య కలదు. ఇట్లధికముగాఁ జేయుటకు తలంపు గలిగియే పోతన గ్రంథారంభంబున నొక్కపద్యంబువ్రాసి యుండె. అందు :-

"గీ. భాగవతము దెలిసి పల్కుట చిత్రంబు, శూలుకైనఁ దమ్మిచూలికైన
     విబుధజనులవలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేటపఱుతు."

సంస్కృతభాగవతమునే తెనిగించు తలంపు గలదేని యిట్లు తెలుపనవసరము లేదు. ఇందు గ్రంథసంఖ్య పెరుగుటకుఁ గారణ మష్టాదశ పురాణములలో విష్ణుమహిమానువర్ణనముంజేయుకథలను కథాసందర్భాను సారు లైన ప్రబంధవర్ణనలుం జేర్చుటయై యున్నది. అందుకు సత్యభామ యుద్ధాదికములును గంగావతరణాది విశేషవర్ణనలును దృష్టాం