ఈ పుటను అచ్చుదిద్దలేదు

596

కవి జీవితములు.

యసూరిం గైవారంబు చేసి హరిహరచరణారవింద వందనాభిలాషిం దిక్క మనీషిం భూషించి మఱియు నితరపూర్వకవిజన సంభావనంబు కావించి వర్తమానకవులకుం బ్రియంబు పల్కి భావికవుల బహూకరించి యుణయకావ్యకరణదక్షుండ నై"

అని యున్నది, పోతన తనకు మంత్రోపదేశము చేసి తరియింపం జేసిన చిదానంద యోగీంద్రునివంటిగురుండే యుండఁగ నాతని తన గ్రంథంబులో నెచ్చెటనైన స్మరియించక యుండునా ? కావున నీవృత్తాంతంబు యుక్తిసహముగ నుండలేదు. ఇదియునుగాక ఇతఁడు రామమంత్రోపాసన చేసె నని చెప్పినవృత్తాంతంబు నంతమాత్రముగనే యున్నది. శ్రీరాముఁడు గృతిపతియేని అతనిస్తోత్ర ముండునుగదా. దానిం జూచిన శ్రీకృష్ణస్తుతిగాఁ గాన్పించు. ఎట్లనఁగా :-

"ఉ. శ్రీకైవల్యపదంబుఁ జేరుటకు నై చింతించెదన్ లోకర
      క్షాకారంభకు భక్తపాలనకళాసంరభకున్ దానవో
      ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృజగాలసంభూతనా
      నాకంజాత భవాండకుంభకు మహానందాంగ నాడింభకున్."

అని యందు "నందాంగనాడింభకున్" అనువాక్యము శ్రీరామపరము కా దనియు శ్రీకృష్ణపరమే అనియును స్పష్టము. షష్ఠ్యంతములలో నేదేవుని వక్కాణించినాఁడో అని చూడఁగా నందు నీప్రకారము శ్రీకృష్ణుని నుద్ఘాటించినట్లు స్పష్టమగుచున్నది. ఎట్లం టేని :-

"ఉ. హారికి నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్యసం
      హారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబినీమనో
      హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా
      హారికి బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్."

ఇట్లు స్పష్టముగా శ్రీకృష్ణునిపేరిట కృతిముఖము కాన్పించు చున్నపుడు నీ శ్రీకృష్ణుంఁడే పోతానామాత్యున కుపాసనాదేవతగా భావించవలసియున్నది. ఇతని నుద్దేశించియే మొదటిరచనకు గమకించి యుండును. అయితే భాగవత కథానాయకుండును కృతినాయకుండు నొక్కం డవుటకంటె శ్రీకృష్ణునకు రూపభేదంబుగా నున్నశ్రీరాముని దీనికిఁ గృతిపతిగాఁ జేసిన లెస్స యై యుండునని యూహిం