ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

585

చేతనే అట్టిదానిని బెద్దనవిరచితముగా జెప్పుట యుక్తము కాదు. పెద్దన తదాస్థాన ముఖ్యపండితుఁ డగుటంజేసి స్వారోచిషమనుసంభవమునందలి పద్యము లిం దుండుటకుఁ గారణ మై యుండు. కావలసియుండినఁ గారణాంతరముల వలసినన్ని కల్పించుకొనవచ్చును.

మఱియు సీతారామాచార్యకృత మగు "అలఘుకౌముది" యందు నాముక్తమాల్యదా విషయమునుగూర్చి వ్రాసిన యంశము పైయభిప్రాయమునకుఁ దోబుట్టువుగాన దాని నిట వ్రాయుదము.

ఇట్లు,

పత్త్రికాధిపతి

"ఆముక్తమాల్యదాకారుఁ డలఘు రేఫములుగాఁ బ్రయోగించినవాని నితరకవు లట్లు ప్రయోగింపకుండుటచేత నతఁడును లఘ్వ లఘు రేఫములకు మైత్త్రిఁ గలుగఁజెప్పినవారిలో నొక్కఁడనియుఁ దలఁపవలయును. శైలి లోనగువానిఁ బట్టి చూడ నాముక్తమాల్యదఁ జేసి నాతఁడు పెద్దన కాఁ డని దృఢముగాఁ దోఁచుచున్నది. పెద్దనకవి విరమించిన స్వారోచిష మనుసంభవమునందు లక్షణదోష మొండేనియుఁ గానరాదు. తద్విరచితం బగుగ్రంథములోని పద్యములు గొన్ని యందున్న వని చెప్పవత్తురేమో, అయిన దానికిఁ గారణాంతరమేమేనియు నుండవచ్చు." అని యిట్లుగా నుపన్యాసకునియుపన్యాసముపై నీయం బడిన పండితాభిప్రాయముం దెలిపి యిపుడు నేను చేసినసంవాదము పై పండితాభిప్రాయములకు విశేషముగా భేదించి యుండ దని తెల్పి యిప్పటి కీసంవాదము మానెదను.

విజ్ఞాపనము.

పాఠకులతో నే నీభాగము ముగించుచుంటి నని విన్నవించుకొనుచున్నాఁడను. ఏమనఁగా - నిదివఱలో వివరింపఁబడినకృష్ణరాయచారిత్రము అతివిపులమైనను పాఠకులు కింకను విపులగాథ లున్న చారిత్రములు చదువవలయు ననుకుతూహలమును బుట్టించును. అట్టిసమయములోఁ జారిత్రము వ్యాపకములో లేనట్టియుఁ గేవలము పుస్తకగాథలే ప్రధానములుగాఁ గలకవులచారిత్రముల నిందుజేర్చుట యుచితముగాఁ గాన్పిం