ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

47

65. రామరాయరాజ్యస్థాపనాచార్యుఁ డనుబిరుదు - యాచసూరుఁ డనునీవంశజునిచేతను రమారమి రాయప్పనాయని కాలమునాఁ డే సంపాదింపఁబడినది.

ఇంతవఱకును జెప్పఁబడినబిరుదములు స్వదేశప్రభువులవలన నాదిజగన్నాథరావువంశజు లగువేంకటగిరి, పిఠాపురము, బొబ్బిలి మొదలగుసంస్థానములవారు సంపాదనము చేసినవియై యున్నవి.

అటుపిమ్మట తురష్కులకాలములోను, హూణప్రభుత్వములోను సంపాదించినబిరుదములు నవీనములు గావున వారివంశచారిత్రములో వ్రాయఁదలఁచి యిప్పటి కిది వ్రాయ విరమించెదము.