ఈ పుటను అచ్చుదిద్దలేదు

580

కవి జీవితములు.

గ్రంథములఁ జేసినవారు ద్వైతగ్రంథములు చేసినట్లుగాని, ద్వైతశాస్త్రాధ్యేత లద్వైతములో గ్రంథములు చేసినట్లుగాని వినలేదు. పరమతనిరాస పూర్వక స్వమతస్థాపనకై కొందఱుపండితులు పరమత పూర్వపక్షములఁ గొన్నిటి నేర్చుకొనియున్నను వానిలో గ్రంథముల రచియించి అయామతములలోని అనుభవశాలులకు మార్గదర్శు లయినారని వినియుండుట అనుభవవ్యతిరేకము. పెద్దన అట్లుగా వైష్ణవమతస్థుఁడు కానట్లు మనుచరిత్రవలనఁ గానుపించినను కేవలము శఠగోపస్వామిశిష్యుఁడ నని చెప్పుకొని నంతమాత్రముచేత విశిష్టాద్వైతభాష్యము నెఱిఁగి దానిసంగ్రహము ఆంధ్రములో గ్రంథరూపము చేసి యున్నఁ జేసియుండెనేమో. అది అనుభవ వ్యతి రేక మైనమాట. అన్యమతస్థులకడ సంస్కృతముగాని మఱియేభాషగాని నేర్చుకొనినవారికిఁ దమగురువులపరమార్థ మతమంతయు దెలుసుకొను ప్రజ్ఞయే యుండిన మహాగౌరవావహకార్యమే. అయితే లో కానుభవము దానికి వ్యతిరేక మై యుండుటచేతను పైసిద్ధాంతము మనస్సునకుఁ బట్టకయున్నది. స్మార్తులలో వైష్ణవమతము నవలంబించి ననియోగులు పెక్కండ్రు గలరు. వారు కేవలము విష్ణునియెడలఁ గల్గుభక్తినిఁబట్టి వైష్ణువులకడ శిష్యులై నును, తమవంశక్రమాగత మగుస్మార్తదేవతో పాసనలు వదులునాచార ముండదు. కేవలము వైష్ణవమత ప్రవర్తకులు శివశక్త్యాదిభిన్న దేవతా నుతులు మాని విష్ణుని ఆయుధాదులను వాహనాదులను తఱుచుగా నుతియించెదఱు. పెద్దన మనుచరిత్రములో నీపైదారిం గైకొనక శివశిక్త్యాదుల నుతియించుటంజేసి అందులో భగవద్విషయమై వివరించునపుడు కేవల శేష శేషిభావము ప్రధానముగాఁ జెప్పక యద్వైతమతస్థు లగు బమ్మెరపోతన మొదలగువారు చెప్పిన విధముననే చెప్పుటచేతను పై గ్రంథకర్త లిర్వురును భిన్ను లని నేనూహించితిని. ప్రస్తుతములో నింతకంటెఁ బాఠకుల కవసరముండదు గనుక నీసంప్రశ్నము విడువవలసినదే అని చెప్పెదను.