ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

577

చరిత్రకంటె మొదట వ్రాయఁబడినయెడల ప్రథమ రచితగ్రంథంబున నొకటి రెండు తప్పులుండుట సహజంబు" అని వ్రాసిన దాని కర్థమేమో యూహింపలేక యున్నాను. విద్యావిషయకోపన్యాసములలోను, అందులోఁ జారిత్రాంశములఁ బూర్వపక్షము చేయునపుడు నిట్లుగా నేరేనిఁ దాను చేసినసిద్ధాంతమును తానే పూర్వపక్షము చేసికొనుచుండఁగా నిపు డెద్దానికి నేను సమాధానము చెప్పవలసియుండునో యూహింపలేక యున్నాను. మనుచరిత్రకంటె నాముక్తమాల్యద ముం దననిచో నది కా దని చెప్పవచ్చును. లేదా మనుచరిత్రమునకంటె తరువాత ననఁగా దానినైన కా దని చెప్పవచ్చును. ఒకపరి ముందు, మఱియొకపఱి వెనుక నని చేయు పూర్వపక్షమునకు సమాధానము చేయువా రెవరైన దేవాంశ సంభూతులు రావలెనుగాని నాయట్టివాని కది సాధ్యకార్యము కాదు.

అదియటుండ "దాని తల్లిగ నల్లసానిపెద్దన చెప్పె ముది మది తప్పి యాముక్తమాల్యద" అనుదానికి దేనితల్లిగాఁ జెప్పెనో నాకు బోధించలేదు. ఇది పాండురంగవిజయములోని పద్యమఁట. అనఁగా గగనకుసుమములను జంద్రునిలో నుండిలేడి మేయఁగా దానిని శశవిషాణముతోఁ బొడిచినట్లు కాన్పించుచున్నది. పాండురంగవిజయము పుట్టుట హుళక్కి యని రామలింగము చారిత్రములో నిదివఱకే నేను చెప్పియుంటిని. కావున నిపు డద్దానిం జూచుటకుఁ బాలకులం గోరుట కంటె వేఱుసమాధానము వ్రాయను.

పూ. 3. (c) అప్పకవీయమునందుఁ బ్రథమాశ్వాసాంతమున "ఆంథ్రకవితాపితామహుఁడు చెప్పిన విష్ణుచిత్తీయమునం దున్న" పూనిముకుందు నాజ్ఞఁగను బొమ్మనె గాంచి " అనుపద్యము నప్పకవి వ్రాసెను."

స. 3. (c) అప్పకవి చెప్పినదే వేదవాక్య మనుకొనువా రెట్లూహించిన నూహింపవచ్చును. అప్పకవి పైవారి (అనఁగాఁబెద్దన్న యొక్క కృష్ణదేవరాయలయొక్క) కాలీనుఁడు కాఁడని పైవార లిర్వురును శా. స. 1400 కాలమువా రగుటం బట్టియు నప్పకవి శా. స. 1600 కాలపు