ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

555

నట్లే చేయుదము. వరదరాజమ్మను సాగఁబనిచి కృష్ణరాయఁడు మరల వివాహంబునకు బ్రయత్నంబుఁ జేయుచుండె. ఇట్లుండ నీతనికి నుత్కలదేశంబునకు (Orrissa) దండయాత్రార్థియై చనవలసినపని వచ్చె. అతఁ డచ్చో గొన్నిదినంబు లుండి యాభూమిపాలుని జయించిన నాతండు సంధికినొడఁబడియె ననియు నపుడు కృష్ణరాయం డాతనికూఁతుఁ దన కుద్వాహంబు సేసిన సమాధానంబు కల్గుననియె ననియుం జెప్పితిమి. (ఇపుడు వ్రాయుచున్న గాథ కృష్ణరాయ విజయగ్రంథానంతరగాథ) దాని కాతండు సమ్మతించి తనపట్టణంబు నలంకరింప చాటఁబనిచి తన నగరు నగురు ధూపాది సుగంధవస్తు సంవాసిత మగున ట్లొనరించె. ఆ వార్తలు విని యాభూపతి పుత్త్రిక తాఁ గులహీనుని భార్య గావలసె నేమి సేయుదు దైవమా యని చింతించి తుదకు నాకృష్ణరాయనిం జంపి తానుం జచ్చెద నని నిశ్చయించుకొనియె.

ఇట్లు నిశ్చయించుకొని తనకు మిక్కిలి యిష్టురా లగు తనచెలికత్తెతో నావృత్తాంతంబు మెల్లనఁ దెల్పి తనయుపాయంబున కపాయంబు లేదుగదా యనుడు నయ్యింతి యాచిన్నదానివాక్యము నెంతయుఁ బోషించి యా పెబుద్ధిం భూషించి దానిం దప్పకసేయు మని తెల్పి నిజావాసంబునకుం జని తనకు మిక్కిలి హితురా లగు నొక్క పూఁబోణికి శ్రుతపఱిచె. ఆఁడుదాని నోట నూవుగింజ దాఁగ దను నట్లు అది తనప్రాణసఖితోఁ దెల్పె. అయ్యింతి తననేస్తపుఁగత్తెతో విన్నవించె. ఇట్లీవర్తమానం బానోటనుండి యానోటఁ జేరి క్రమంబుగఁ దిమ్మరుసుచెవిం బడియె. ఆలోఁ గృష్ణరాయలను మంగళస్నానంబునకుం గొంపోయి యభ్యజనంబు గావించుచుండిరి. తిమ్మరు సెంతయు దనలో నాలోచనంబు సేసి యిపు డేమైన నోరు మెదపినఁ గార్యభంగం బౌ నని యెంచి తగునుపాయం బాలోచించుచుండె. ఇచటఁ గృష్ణరాయలఁ దెచ్చి పెండ్లిపీఁటపైఁ గూర్చుండఁబెట్టి యాయంగనామణికి మంగళసూత్రంబు గట్టించి. ఆరాత్రి యొకశుభముహూర్తంబున శ్రీపుష్పయోగం