ఈ పుటను అచ్చుదిద్దలేదు

554

కవి జీవితములు.

ఇదివఱలోఁ గృష్ణరాయ విజయములో గజపతి తనకూఁతునిచ్చి కృష్ణరాయనితో సంధిచేసుకొనె నని చెప్పఁబడినది. అది మొదటిదో యీకథ మొదటిదో తెలియఁ జేయుగ్రంథములు దొరకకపోవుటచేత నిపుడు మనము వ్రాయుచున్న గాథ కాధారము లేదు పైగా నీచిన్నది వినుకొండలోనుండు గజపతివంశీయుల పిల్లగాఁజెప్పఁబడును. కాని టైలరు దొర తావ్రాసిన యనాలిసెస్ (Analises) అనుగ్రంథములో మాత్రము కృష్ణరాయనిభార్య విజయనగరమునకుం బోవుచుఁ దా నొక స్థలములో నిలిచి అంతకుఁబైకి బోవ నని చెప్పె ననియు, నాకారణమునఁ గృష్ణరాయ లాపె నచటనే నిల్పి తగినవసతి యేర్పఱిచె నని ఈక్రిందివిధంబుగాఁ దెల్పును [1]

అంతమాత్రమున పైకథ కృష్ణవిజయకథతోఁ గలుపఁ గూడదని తలంచెదను.

కృష్ణరాయలద్వితీయవివాహము.

వరదరాజమ్మ కార్యములనుడువు తఱి మఱిచి పైదానిఁ దెల్పుట కెడమీయమైతిమి మన మీతనిప్రథమవివాహ వృత్తాంతము దెల్పి యూరకుండిన నిఁక నీతండును వరదరాజమ్మపోలిక మునివృత్తి నుండె నని తోఁచనోఁపు. అటుగావున నాతని ద్వితీయ వివాహవృత్తాంతంబును దెల్పుదము. అదియుఁ దొల్లిటికథయట్లే యుండుటంజేసి మరలఁ దొంటి వృత్తాంతమునే చెప్పుచుంటి మని చదువువార లూహింపఁగలరు. కావున మనము ముందుగా నీరెండుకథలకుం గలపోలికఁ జూపి దీనిలో భ్రమ యుండఁగల దని సూచించి కథ వాక్రుచ్చుట మంచిపనికావున

  1. "The Gajapati King's daughter named Ruchi Devi (?) felt disposed to remain near Stambam (Cumbam) and the Rayar directed to do so, While he returned to Vizianagaram. That daughter of Gajapati, Ruchidevi said that as Kristnadevaraya was the son of a Dasi, and she herself of noble tribe illustrious by her birth, she preferred to abide by Kambam. Her father sent her thither large sums of money; she sold those jewels and had a very large water reservoir excavated near Cambam and she distributed very extensive charities