ఈ పుటను అచ్చుదిద్దలేదు

550

కవి జీవితములు.

స్సంధాన ముహూర్తంబు దైవజ్ఞులచే నుంపించి యానాఁటిరేయి నొకభవనంబు విచిత్రంబుగ నలంకరింపఁ బంచి యందావధూవరులనుఁ బ్రవేశంబు సేయించె. ఆంతకుము న్నా పట్టమహిషి చెలిక త్తియలందఱు లతాంగికి కంటకంబుల నంటించు తెఱుంగున నాలతాంగికి మొలచుట్టును కత్తులఁ గట్టి పైని మృదుదుకూలంబులు కప్పి పయోముఖ విషకుంభంబుంబలె నుండ నలంకరించి యాయింట నొంటిగ నిల్పి వారందఱుఁ దాంబూలంబుల నందికొని యొకరొకరుగ గదిలోనుండి జాఱి తలుపు బిగించిరి. అపుడు కృష్ణరాయం డాలలనామణి కట్టియున్నగాగరఁ దనకాల నొడిసి పట్టి సామీప్యంబునకుఁ జేరదీసె. అపు డాకత్తులమొలనూ లుల్కాపాతంబుంబలె నేలపై నాచిన్నదానియరిష్టంబుఁ దెల్పుచుం బడియె. రాయఁ డాకత్తుల మొత్తంబుఁ జూచి యప్పా యేమి చిత్రము అని తిమ్మరుసును బిలిచె. ఎచ్చటనో నక్కియున్న తిమ్మర నవ్వార్త విని "జాగ్రతో భయం నాస్తి" అని యుత్తరం బిచ్చి యొకభటునిచే సేనల సన్నాహంబున నుండ వర్తమానంబు పంచి వెంటనే కొందఱ దాసీజనంబులఁ బిలువంబంచి దాసీజనం బిదె వచ్చియున్నా రని తెల్పె. అప్పల్కులు విని రాయండు తలుపు విచ్చి వెలికిం జనుదెంచి వారలతో నాచిన్న దానిని దోడ్కొని చని ఆపెజనకునియింట దిగవిడిచి రమ్మని యాజ్ఞ యొసంగె. అపుడు వారొకపల్లకిం దెప్పించి యాచిన్న దాని నం దుంచి యారాత్రియే బయలు వెడలిరి. వీరికి సాహాయ్యంబుగఁ గొన్ని సేనలు తిమ్మరుసుచే నడిపింపఁ బడియె అపు డాచిన్నది తనద్రోహబుద్ధికి రాజుదాక్షిణ్యచిత్తంబునకు గలతారత్తమ్యం బాలోచించి యహహా! యిట్టిపతికి దూరం భైతి. ఇఁకఁ బుట్టినయింటికి వారు చెప్పినకార్యంబు నడుపక యూరక చని తిరిగి వారిముఖ మెట్లు చూచెద. కావున నీసమీపంబున నున్న వనంబులో నుండి నేజేసిన మహాద్రోహంబునకుఁ బ్రాయశ్చిత్తవిధానం బరయుచు భగవంతుని స్మరించుచుండి కాలంబు గడి పెద నని నిశ్చయిం