ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

549

తిమ్మరుసు లగ్న నిశ్చయంబు సేసిమారాజులయింటఁ బెళ్ళికుమారుఁడు బాకునకు బాషికంబు గట్టి దానినే వివాహంబునకు బంచెడు నాచారంబు గలదు. సుముహూర్తదినంబునకు బాకుం దోడ్కొని మేమందఱము వచ్చెద మని వర్తమానంబు పంపించె. దాని విని గజపతి తిమ్మరుసుని యాలోచనమునకు సంతసిల్లి వల్లెయనియె. అప్పుడు తిమ్మరుసు కృష్ణరాయని నాతనిపురంబు చేరం బనిచి సుముహూర్తంబునాఁటికి నుత్సవంబుతో బాకుం దెప్పించుకొనియె. ఆబాకునకే గజపతిపుత్త్రిం బరిణయంబు సేయించి మరల దానిని గొని చిన్న దానిని మంచిదినంబున మారాజుకడకుఁ బంచివేయుండని తెల్పి సపరివారంబుగఁ దానుఁ దన ప్రభునిపట్టణంబునకుఁ జనియె.

గజపతియుఁ దనకూఁతుని నల్లునికడకు నంపుతలంపున నొకశుభ దినంబున సర్వసన్నాహంబులుఁ గావించి దాసీదాసాదులను కనకాంబరాభరణంబులను నిచ్చి ప్రయాణంబు సేసె. అపుడు పెండ్లికూఁతు తల్లి మొదలగువారందఱుఁ పెండ్లికూఁతుకడ కరుదెంచి బుద్ధులుసెప్పెడు తెఱంగున రహస్యంబుగఁ గృష్ణరాయల నెటులైనం జంపి తమకొలంబునకు విఖ్యాతి దెమ్మని బోధించిరి. అయ్యబల వీరిబుద్ధులకు నేమియుం బల్కవోడి తా నట్టికార్యంబునకుఁ జాల ననియె. దాని విని వారలు దాసీజనంబులలోఁ గొందఱకు నాతనిం జంపుబుద్ధులం దెల్పి వధూవరులం గదిలోని కనుపుచో నయ్యింతికిఁ గోప్యంబుగఁ గత్తులు గట్టుఁ డనిరి. వారును మంచిదని తత్ప్రయత్నంబుననే యుండిరి. సన్నాహం బైతిమని రాజునకుం దెల్ప నాతండు వారినందఱనానెగొందికి సాగఁబనిచె. వారును కతిపయదినంబులకు రాజధానికి వచ్చి చేరిరి. రాజును తనపట్టమహిషి వచ్చెననుమాట విని యూరును నగరును నలంకరింప భటులం బనిచె. తనరాణికిఁ దగు భవనంబుఁ జూప దాసీజనంబుల నియమించె. వారు నామెం దోడ్కొని చని యాభవనంబున విడియించిరి. ఇట్లు కొన్నిదినంబు లుండం దిమ్మరుసు నూతన రాజదంపతులకుఁ బున