ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

543

వేళ నెదిరించుటకై దాఁగుండి రని అతనికిఁ దెలియవచ్చెను. అప్పు డతఁడు పాట్‌హిఖాన్, రస్టమ్‌ఖాను, అనువారలను రెండువేలగుఱ్ఱపు దళముతో పంపెను.

వారిద్దఱు అడవులకు వెళ్లి వారితో యుద్ధము చేయఁగా అశత్రువులు వారియాస్తిని కుటుంబములను వెనుకకు విడిచిపెట్టి కొండలకు పాఱిపోయిరి. ఫాదుషా సేనానాయకులు వారిని ఖైదీలఁగాఁ బట్టుకుని వారిసొమ్ము దోఁచుకొని తమ ప్రభువువద్దకు జయముతో వచ్చిరి.

వాసనాద్రన్ ఒడంబడికచేయుట.

గజపతి.

రామచంద్రదేవు తన రాజ్యమునుండి పాఱిపోఁగానే టెలింగ నాకును, బంగాళా సరిహద్దులకును మధ్య నున్న దేశపు రా జైనవాసనాద్రన్ అనువాఁడు ఫాదుషాతో నొడంబడిక చేసుకొనెను. ఒడంబడిక షరతు లేమనఁగా గోదావరీనది ఒకవైపు సరిహద్దుగా బంగాళాదేశము మఱియొకవైపు సరిహద్దుగాను గల్గి టెలింగనా, ఒరిస్సా దేశములతోఁ గూడుకొనినదేశము తనకు నీయఁబడవలె ననియు, గోదావరినదికి పైగా నున్నదేశమంతయు ఫాదుషాకు నిచ్చివేయుట యనియు. ఈ షరతులకు ఫాదుషా యిష్టపడి యా రాజునకు సంధిషరతులప్రకారము పట్టా యిచ్చెను. అప్పటినుండి ఏలూరు మొదలు ఫాదుషా రాజ్యము వఱకు నున్న పరగణాలు ఫాదుషావలన నేలఁబడెను.

బీజనగరముతో యుద్ధము.

ఫాదుషా టెలంగనా, ఒరిస్సాలపై దండెత్తియుండఁగా, బీజనగరపురా జైన కృష్ణరాజు ఫాదుషా దేశమునకుఁ జుట్టుపట్ల నున్న దేశమును దోఁచుకొని, ఫాదుషా వచ్చు చుండుట విని తాను తన దేశమునకుఁ బోయెను. ఆ సంగతి వినఁగానే ఫాదుషా క్రిందనున్న అమీరులు, కృష్ణానదికి అవతలివైపున నున్నట్టియు, కొండపల్లికి నెదురుగా నున్నటి కొండబీర్ అనుదేశమును తీసుకొమ్మని సలహా