ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

535

యును దన కాజ్ఞ యొసంగుమనియుఁ గృష్ణరాయనిం బ్రార్థించెను. దానిని విని కృష్ణరాయం డట్లే చేయు మని యాజ్ఞ నొసంగఁగా నాసేనాని తనసేనలతోఁ గృష్ణానది దాఁటి శత్రుసేనలపైఁ బడి యుద్ధము ప్రారంభించెను. అపుడు తురుష్క సేనయును ముష్కరముగఁ బోరనారంభించెను. ఆ యుద్ధము క్రమక్రమముగ నొక చండభండన మాయెను. తురుష్కులలోఁ బెక్కండ్రు హతులైరి. మిగిలినవారు నిలువలేక పలాయితు లైరి.

ఇట్లుగా శత్రువులు పలాయనముచేసిన యనంతరము కృష్ణారాయని సేనానులలోఁ గొందఱు శత్రుపట్టణములను వెంటనే పట్టుకొనుట మంచిది యని విన్నపము చేసిరి. కాని కృష్ణరాయని మంత్రిమాత్ర మట్టిపని చేయఁగూడదనియు నాస్థలములు మిగులఁ జతురంగబలయుక్తములై యున్న వనియుఁ జెప్పి ఆపట్టణములపైఁబోవు యత్నము గజపతిపైఁ బోవం జేయవలయు నని రాయనితో విన్నవించెను. ఇంతియ కాక గజపతియొక్క సేనలు కృష్ణరాయనిసేనలు నడుచునపు డనేకవిధముల మార్గవిరోధముం గల్గించుచుండెననియుఁగూడ విన్నవించెను. అట్టి మంత్రి వాక్యములకుఁ బ్రభుఁడు సమ్మతించి తనసేనల గజపతిపై నడిపించుట కాజ్ఞ యొసంగెను. పిమ్మట గృష్ణరాయని సేనలు గజపతిదేశము పై నడువ నారంభించెను. అట్టిసమయములో నాదేశములో నుండుసామంతప్రభువులు రాయలసేనల నెదిరించుచుండిరి. ఆసేన లోక వ్యూహముగా, గాని సంఘముగాఁగాని చేరి యుద్ధము చేసి యుండలేదు. కావున వారందఱును గృష్ణరాయనివలన సులభముగా జయింపఁబడిరి. కాని కృష్ణరాయలు వారినందఱ నాదరించి గారవించి వారివారిస్థలములు వారికిఁ దిరుగ నిచ్చి కప్పము కట్టుకొని వారిని వారిస్థానములలోనిలిపెను.

అటుపిమ్మటఁ గృష్ణదేవరాయలు ముందు నడిచి అహమదునగరములో (Ahmadnagar)లో తనసేనల నిలిపెను. అపు డచ్చో నుండు తురుష్క సేనలు భయంకర మైనయుద్ధముం జేసి తుదకుఁ బరాజయము