ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కవి జీవితములు



చక్రవర్తులకు ముఖ్యపట్టణమై యుండినది. అట్టిచక్రవర్తిని జయించుటకుఁగాను వారికోటతలుపుల బ్రద్దలుగొట్టె నని యర్థము.

ఇదివఱకుఁ గలబిరుదు లన్నియును జెవ్విరెడ్డినాఁటికే కల్గినట్లు కాన్పించును. ఈక్రిందిబిరుదులు చెవ్విరెడ్డియనంతరకాలమువారివలన సంపాదింపఁబడినవి. అందు ఖడ్గనారాయణభుజాబలభీమ, గండభేరుండ, ప్రతిగండబైరవ, శ్వేతకేతన, వైరితలగుండుగండ, ఛండభీమ, మండలీక రగండ, కోటగిరివజ్రాయుధ, అసహాయశూర, గరుడనారాయణభల్లరగండ, రణరంగభైరవ, వైరిగజాంకుశ, రాహుత్తమల్ల, హన్నిబ్బరగండ, రిపుగజసంచయ పంచానన, సామంతరాయగోపాల, రాయరాహుత్త, సింహతలాట, శాత్రవారణ్యగహనదావానల, పట్టుతలాటాంక, రాయవేశ్యాభుజంగ, ఏకధాటీసమర్థ, కోటలగొంగ, ద్విశాఖకరదీపికాబిరుద, పనఘానబసవశంకర, పరరాజన్యదౌర్జన్యశ్వసనగ్రసనాత్యుగ్రనాగబిరుద, భల్లరగండయనుబిరుదులు చారిత్రోపయోగములు కావు. ఇఁకఁజారిత్రోపయోగము లయినవాని నీక్రింద వివరించెదము. ఇక్కడికి బిరుదుల సంఖ్య 41.

42. కాకతీయరాజ్యస్థాపనాచార్య - అనునది గణపతిదేవునకు సేనానిగా నుండినప్రసాదిత్యునివలన సంపాదింపఁబడినది. గణపతి దేవుని యనంతరము రాష్ట్రములోఁ గల్గినయుపద్రవముల నివారించి యతని భార్యను రాజ్యమున నిల్పుటచేఁ గల్గెను.

43. రాయపితామహబిరుదు - ఇది ప్రసాదిత్యుఁ డనుప్రభునికాలములోఁ గల్గినది. గణపతిదేవుని యనంతరము ప్రతాపరుద్రుని బాల్యమున రాష్ట్రవ్యవహారము గణపతిదేవునిభార్య యగురుద్రమమహాదేవి చేయుచు వచ్చెను. ఆమెకు నీప్రసాదిత్యుఁడు మంత్రియై యుండి రుద్ర మహారాజునకు విద్యాబుద్ధులు గఱపుచు నాతనిచేఁ దాత తాత యని పిలువఁ బడుటచే రాయపితామహుఁ డనుబిరు దందెను.