ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

533

డినది. మొదట లక్ష్మీదేవి అతని నొకస్థల మన్వేషించు మని కోరెను. అతఁ డపుడు తుంగభద్రానదీతీరమునకుఁ బోయి అచ్చో విరుపాక్ష దేవు నాలయముం జూచి ఆస్థలమాహాత్మ్యముం దెలిసికొని అది రామాయణములోని యొకయితిహాసముం దెల్పుస్థల మవుటంజేసి అది నివాసార్హ మని భావించెను. ఆ పర్వతముపైకి సుగ్రీవుఁ డెక్కఁగా వాలి యెక్క లేక పోయెనఁట. మాల్యవంత మనుపేరుతో నైదుపర్వతము లచ్చో నుండును. యమకూటము, బసవశృంగము, మతంగ పర్వతము, కిష్కింధ అనునవి మిగిలిన నాల్గుపర్వతములు నై యున్నవి. అచ్చటి వారందఱు నాప్రదేశము నివాస యోగ్యమైన దని విద్యారణ్యులకుం దెల్పిరి. ఆసమయమందున నొక చెవులపిల్లి యొకసింహముం దఱుమఁగా నదానిని విద్యారణ్యు లీక్షించెను. అట్టి దాని కాశ్చర్యము నంది అది శూరులకు ముఖ్యస్థానముగా నిశ్చయించెను. ఆస్థలమం దొక పట్టణముం గట్టి విద్యారణ్యస్వామి దానికిఁ దనపేరిట విద్యానగరమ నునామం బుంచెను.

ఈ పైగ్రంథములో మఱికొన్ని కథలు తెల్పంబడిన యనంతరము నరసింహ రాయ లనురాజు పైస్థలవిశేషముల విని తనమంత్రి యగునప్పాజీని పిలిచి తనకుమారుఁ డగుకృష్ణరాయని ఆస్థలమందు పట్టాభిషేకము చేయు మని చెప్పెను. ఆమంత్రియు నటులనే కావించెను. కృష్ణరాయ లపాజీని రాజ కార్యములలో సహాయము చేయఁగోరుచుండెను. అప్పాజీ యట్లే చేయుచుండెను. అనంతరము కృష్ణరాయలు తనరాజ్యములోని కోటలును, ఇతరము లైన దుర్గస్థలములను జూడఁగోరెను. పిమ్మట ననేక రాజకీయ వ్యవహార విశేషములఁ బూర్ణముగాఁ దెలిసికొని రాయ లట్లుగా విన్న సంగతులు యథార్థము లగునో కావో కనిపెట్టుటకు మాఱువేషంబునఁ దిరుగుచున్న కాలములోఁ గృష్ణరాయ లొకప్పు డొక బ్రాహ్మణులయింటి ప్రచ్ఛన్నముగా నుండెను.

అపు డతని హరకారులు వచ్చి అతనితో మాట్లాడుచుండుట