ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

525

rరాయలు ఇంతవఱకు నతని వంశ్యులు పాలించిరి. శా. స. 1280 చివరవఱకును దేశము అ రాజకముగా (ప్రభువు లేకుండ) నుండెను. శా. స. 1300 మొదలు 1340 వఱకును ఇమ్మతూరిరాయ లతనివంశ్యులు, శా. స. 1341 మొదలు 1384 వఱకుఁ బాలించిరి. నంజరాయలు 1385 మొదలు 1416 వఱకు, గోవర్ధనరాయలు పాలించెను. జయదేవరాయలు దేశ మాక్రమించుకొని శా. స. 1492 వఱకును పాలించెను. ఇమ్మడి జగదేవరాయలు 1515 చివరవఱకుం బాలించిరి. కుమారజగదేవరాయలు శా. స. 1222 వఱకుం బాలించిరి. (ఇందలికాల మేలెక్కకును సరిపడియుండలేదు.)

page 527.

నెల్లూరిజిల్లాలోని మమతులూరుగ్రామకైఫియ్యతులోఁ గృష్ణదేవరాయలు గజపతిరాజుం జయించినప్పుడు లాకరాజు, చిట్టమరాజు, నారాయణరాజు, అను మువ్వురును ఆస్థలమందుండి వ్యవహరించుటకుఁ బంపెను. ఆ మువ్వురిలో ప్రతిమనుజుఁడును తనపేరితో నొక్కొకమండలము నేర్పఱిచిరి.

కమలాపుర వృత్తాంతములో:-

కమలాపురమునకుఁ బడమర నొక పరువు దూరమున చదిపి రేల అను గ్రామమును బ్రాహ్మణులకు సర్వాగ్రహార మిచ్చినందులకు దాఖలా చదిపి రేల గ్రామమున అగస్త్యేశ్వరుని ప్రాకారము లోతట్టుఱాతికి శాసనమున్నది. అందలి యక్షరములు శిథిలమైనవి. ఆ శాసనములో నాగ్రామస్థుల గోత్రము, సూత్రము, వారి వారికినిర్ణయించిన వృత్తులు వివరముగానున్నవి. మధ్యమధ్య నక్షరములు చెడిపోయినవి గ్రామస్థులు కృష్ణదేవమహారాయలనాఁడు ధారాగృహీత మైన అగ్రహారమని వాడుకొనుచున్నారు.

ఈ చదిపి రేల గ్రామమునకు దక్షిణమున జమ్మాపుర మను నగ్రహారమును కృష్ణదేవరాయలనాఁడే బ్రాహ్మణుల కీయఁబడె నని