ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

41

3. చలమర్తిగండ. - ఈబిరుదు ప్రతాపరుద్రుని వంశమువారిలోఁ బ్రాచీనకాలమునుండి చెల్లుచున్నది. భేతాళరెడ్డి వంశమువారు రుద్ర వంశజులకుఁ జేసినయుపకారవిశేషంబుచే సమానప్రతిపత్తిం జూపుట కీయంబడిన ట్లూహింపఁబడును.

4. జల్లిపల్లెవీరక్షేత్రణేభారతీకమల్లా - అనుబిరుదు జల్లిపల్లె యను నొకవీరులుండుస్థలమును జయించుటచేఁ గల్గినది.

5. సోమకులపరశురామ - అనుబిరుదు చంద్రవంశపుక్షత్రియులను సంహరించుటచేఁ గల్గెను. ప్రతాపరుద్రవంశమును జంద్రవంశమే యగును. భేతాళరెడ్డి యావంశములో నుండువారికి భ్యత్యతగానుండెను గావున నీబిరుదు ప్రతాపరుద్రవంశజులకుం గాక తక్కినసోమవంశజులవిషయ మై చెల్లు నని చెప్పవలసి యున్నది. పైని మనము చెప్పినజగన్నాథరావుకాలమునకుఁ గళ్యాణీపురమునం దుండుపశ్చిమచాళుక్యులు మిక్కిలి ప్రబలులుగా నుండి బహుదేశములను స్వాధీనపఱుచుకొని యుండిరి. వారికిని నోరుగంటిప్రభువులకును యుద్ధములు జరిగినందులకు గ్రంథదృష్టాంతములు గలవు. కాఁబట్టి సోమవంశము పేరిటి మఱికొన్ని వంశముల వారిని జయించి స్వప్రభువులకు సహాయ మొనరించె నని చెప్ప నొప్పి యున్నది. అనపోతమనాయఁడు మాదనాయనికాలములో నిది జరిగినది. ఇది శాలివాహన సం. 1350 మొదలు 1400 కాలమువఱకు.

6. యంబిరుదుగండ -

7. సర్వబిరుదకుమారవేశ్యాభుజంగ -

8. ఆమనగంటిపురవరాధీశ్వర - అనుబిరు దాదిజగన్నాథరాజు కాఁపురముండుస్థలముంబట్టి కల్గినది.

9. గజదళవిభాళబిరుదు - కరిఘటలం గొట్టుటచేఁ గల్గెను.

10. గాయగోవాళబిరుదు - శత్రులసంపద నాకర్షించుటచేఁ గల్గెను.

11. కంచికవాటచూరకార - అనుబిరుదు కంచికోటతలుపుల నూడఁగొట్టుటచేఁ గల్గెను. ఈకంచిపట్టణము భేతాళరెడ్డినాఁటికిఁ జోళ