ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

519

డదనియుఁ జెప్పవచ్చును. ఇటులనే కృష్ణరాయని కాలముకొని శాసనము లన్నియుం దొరికినఁ గొంతచారిత్రము తేలును. అవి దొరుకుట సుగమముకాదు. కావున పై కళింగ దండయాత్రానంతరము కృష్ణరాయలు చేసిన విశేషములు గ్రంథాంతరములనుండి సంపాదించి సాధ్యమగునంతవఱకు వివరించెదను. ఎట్లన్నను :-

కామలాపురమునకు వాయవ్యము 2 పరువులదూరమునఁ గోకట మనుగ్రామముకు ప్రతినామము కమలాజీ పుర మనునామము పొలిమేరలో వలయవామనముద్ర రాళ్లపై వ్రాసియున్నది. అవి జయసింగు మహారాజు వకీలు కమలాజీ యనువాఁడు అగ్రహారమును చేయించెను. అని స్థలవాసులు వాడుచున్నారు. తరువాత శ్రీకృష్ణదేవరాయలనాఁడు అల్లసాని పెద్దన్న అను ఆంధ్రకవీశ్వరుం డైననందవరీక బ్రాహ్మణుఁడు బహుప్రసిద్ధిగా మనుచరిత్ర మను ఆంధ్రప్రబంధమును చేసినాఁడు. ఆకవీశ్వరునకుఁ గృష్ణదేవరాయలు ఈకోటక మనుగ్రామమును సర్వమాన్యాగ్రహారముగా ధారబోసి యిచ్చినాఁడు. ఈ కవీశ్వరుఁడు బ్రాహ్మణులకు సర్వాగ్రహారముగ నిచ్చి కోకటానికి ప్రతినామము శఠగోపురము అని యీగ్రామన వాకిటివద్ద యిరికిఱాతికి వ్రాసియున్నది. ఇదిగాక యీ కవీశ్వరుఁడు ఈగ్రామమునఁ చెన్న కేశవుని దేవాలయములో నిలువురాతికి వేయించిన శాసనము అన్వయసారాంశము. "శాలివాహన శకవర్షంబులు 1440 అగునేఁటి బహుధాన్య సంవత్సర వైశాఖ శు. 15 లు అల్లసాని చొక్కరాజుగారి కుమారుఁడు పెద్దయ్యంగారు కోకట సకలనాథునిలింగమునకు ఇచ్చిన భూదాన ధర్మశాసనము, శ్రీకృష్ణదేవమహారాయలు మాకును, ఘండికోట సీమలోను పుంబళికెపాలించ నవధరించిన కోకటగ్రామమందును సకలేశ్వరదేవుని నై వేద్యమునకును, దీపారాధనకును చేను ఖ 2 ను సర్వసామాన్యముగా కృష్ణాతీరమందు బెజవాడ మల్లికార్జునదేవుని సన్నిధిని సోమగ్రహణ పుణ్యకాలమందు సహిరణ్యోదక దానధారా పూర్వకముగాను ధారవోసి యిస్తి మని వ్రాసియున్నది.